భువీ మెరిశాడు.. ఆసీస్ కుంగింది!

Update: 2019-06-09 16:55 GMT
భువీ మెరిశాడు.. ఆసీస్ కుంగింది!
  • whatsapp icon

40 ఓవర్ల దాకా అదే తీరు. వికెట్లు పడవు.. పరుగులు ధారాళంగా రావు. చెయ్యాల్సిన పరుగులు తరగవు. ఆడదామంటే అవకాశం దొరకదు. ఇలా నడిచింది ఆస్ట్రేలియా బ్యాటింగ్. అస్సులు పరుగులు ఇవ్వకుండా.. వికెట్లూ దక్కకుండా ఉన్న భువనేశ్వర్కు  స్మిత్ ఎల్బీడబ్ల్యు గా దొరికిపోయాడు. ఆవెంటనే స్టోయినిస్‌(0)ను బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. వరుసగా రెండు వికెట్లు పడిపోవడంతో ఒక్కసారిగా ఆస్ట్రేలియా ఒత్తిడిలో పడిపోయింది. మాక్స్ వెల్ మరో పక్క చెలరేగుతున్నాడు. ఈ సమయంలో చాహల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడిన మ్యాక్సీ జడేజా చేతికి చిక్కాడు. దీంతో 41 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది ఆసీస్. చేయాల్సిన పరుగులు భారీగా ఉండగా.. ఇంకా నాలుగే వికెట్లు కంగారూల చేతిలో ఉన్నాయి. ఇపుడు మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చేసింది. కారే పది పరుగులతోనూ, నైల్ ఒక్క పరుగుతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News