Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం చేసిన భవీనాబెన్ పటేల్

Tokyo Paralympics 2020: టేబుల్ టెన్నిస్‌‌లో భారత్‌కు పతకం ఇదే మొదటిసారి, మహిళల సింగిల్స్‌ టేబుల్ టెన్నిస్ ఫైనల్‌కు చేరిక

Update: 2021-08-28 04:45 GMT

పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయం చేసిన భవీనాబెన్ పటేల్

Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు బోణి కొట్టబోతోంది. ఇండియాకు పతకం ఖాయం చేసింది టెబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్.. దీంతో టోక్యోలో మళ్లీ భారత్ జెండా ఎగిరే సమయం వచ్చేసింది. పారాలింపిక్స్‌లో పతకాల ఖాతా తెరిచే తరుణం ఆసన్నమైంది. అద్భుత ప్రదర్శనతో పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా ఆమె దేశానికి పతకం ఖాయం చేసింది. పోటీల మూడో రోజే పతక ఆనందాన్ని తెచ్చింది. పారాలింపిక్స్ చరిత్రలోనే టేబుల్ టెన్నిస్‌లో భారత్‌కు పతకం రావడం ఇదే ఫస్ట్..

మహిళల సింగిల్స్‌లో క్లాస్ 4 టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ అద్భుతంగా రాణించారు. క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సెర్బియా క్రీడకారిణి పెరిచ్ రాంకోవిచ్ కు షాక్ ఇచ్చారు. 11-5, 11-6, 11-7 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ ప్రత్యర్ధిని వరుస గేమ్‌ల్లో చిత్తు చేసింది. తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్ధితో పోరులో 12వ ర్యాంకర్ భవీనా అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది.. దీంతో విజయాన్ని సొంతం చేసుకుని.. భారత్‌కు పతకం ఖాయమనిపించారు.. 

Tags:    

Similar News