Bhavina Ben Patel: టోక్యో పారాఒలింపిక్స్‌లో భవీనాబెన్ పటేల్‌కు రజతం
Bhavina Ben Patel: * స్వర్ణ పతక పోరులో పోరాడి ఓడిన భవీనాబెన్ * ఫైనల్లో చైనా క్రీడాకారిణి యింగ్ జోహు చేతిలో ఓటమి
Bhavina Ben Patel: టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ తొలి పతకం సాధించింది. అది కూడా ఇప్పటి వరకూ పతకం ఎరుగని టేబుల్ టెన్నిస్ క్రీడలో. ఈ టోర్నీలో తొలిసారిగా భారత క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్.. రజతం సాధించి చరిత్ర సృష్టించింది.. 34 ఏళ్ల భవీనాబెన్ తన ప్రత్యర్థి చైనా ప్లేయర్ యింగ్ జావో పై ఫైనల్లో పోరాడి ఓడింది.
ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో ఇప్పటివరకు భారత్ తరఫున అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా వీరిద్దరు మాత్రమే వ్యక్తిగత విభాగాలలో స్వర్ణ పతకాలు గెలిచారు. విశ్వ క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు టీటీ ప్లేయర్ భవీనాబెన్ పటేల్. టోక్యో పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ క్లాస్–4 మహిళల సింగిల్స్ విభాగంలో భవీనాబెన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో నేడు జరిగిన పోరులో చైనా ప్లేయర్ యింగ్ జావొ చేతిలో భవీనా బెన్ ఓటమి పాలైంది. టోర్నీ మొదటి నుంచి మంచి ప్రదర్శన చేసిన భవీనా రజతం సాధించి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించింది. తన స్పూర్తిదాయక క్రీడా ప్రయాణంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన భవీనాకు ప్రసంశలు కురుస్తున్నాయి.