IPL 2022 New Teams: భారత్ - పాక్ మ్యాచ్ తరువాతి రోజే ఐపీఎల్ కొత్త జట్ల ప్రకటన
* అక్టోబర్ 24న భారత్ -పాకిస్తాన్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ * అక్టోబర్ 25న ఐపీఎల్ రెండు కొత్త జట్ల ప్రకటన చేయనున్న బిసిసిఐ
IPL 2022 New Teams: ఐపీఎల్ అభిమానులకు త్వరలో బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఐపీఎల్ 2021 ముగిసిన మరుసటి రోజే టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24 న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ తరువాతి రోజే ఐపీఎల్ 2022 లో అడుగుపెట్టనున్న మరో రెండు కొత్త జట్లను బిసిసిఐ ప్రకటించనుంది. రెండు వేల కోట్ల బేస్ ప్రైస్ తో పాటు 10 లక్షల రూపాయల నాన్ రిఫండేబుల్ డిపాజిట్ తో బిడ్ జరగనుంది.
ఇప్పటికే ధర్మశాల, కటక్, గౌహతి, అహ్మదాబాద్, రాంచీ, లక్నో వంటి నగరాలు ఐపీఎల్ ఫ్రాంచేజి కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 10న ఫ్రాంచేజి కోసం దరఖాస్తుల గడువు ముగియనుంది. అంతేకాకుండా 2023 నుండి 2027 వరకు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ ప్రసార హక్కులకు సంబంధించిన ప్రకటన కూడా బిసిసిఐ చేయనుంది. ఇప్పటికే షార్ట్ లిస్టు అయిన ఆ ఆరు నగరాల్లో గౌహతి, లక్నో, అహ్మదాబాద్ లకు ఫ్రాంచేజి దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టైటిల్ విజేతగా నిలవడం.., బెంగుళూరు, పంజాబ్, ఢిల్లీ జట్లు ఒక్కసారి కూడా టైటిల్ ని గెలవకపోవడంతో రానున్న జట్ల ప్రదర్శన ఎలా ఉండబోతుందో.. ఇప్పటికే బిసిసిఐ నియమాల ప్రకారం ఒక టీంలో నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం కల్పించడంతో మిగిలిన కీలక ఆటగాళ్ళను కూడా జట్లు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న జట్లలో నలుగురు మినహా కొత్త ఆటగాళ్ళే వస్తారా లేదా ఇప్పటివరకు ఉన్న ఆటగాళ్ళనే జట్టు యాజమాన్యం భారీ మొత్తం చెల్లించి తిరిగి జట్టులోకి తీసుకుంటారో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే..!!