Gautam Gambhir: గంభీర్‌ను ఇంటర్వ్యూను చేయనున్న బీసీసీఐ.. టీమిండియా హెడ్ కోచ్‌గా ప్రకటించేది ఎప్పుడంటే?
ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్న సంగతి తెలిసిందే. అతని నాయకత్వంలో, భారత జట్టు T20 ప్రపంచ కప్ 2024లో పాల్గొంటోంది
Gautam Gambhir Team India Head Coach Interview: గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ అవ్వడం దాదాపు ఖాయమైంది. నివేదికల ప్రకారం, భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి గౌతమ్ గంభీర్ మాత్రమే దరఖాస్తు చేసుకున్నాడు. బీసీసీఐ నేడు అతనిని ఇంటర్వ్యూ చేయనుంది.
ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్న సంగతి తెలిసిందే. అతని నాయకత్వంలో, భారత జట్టు T20 ప్రపంచ కప్ 2024లో పాల్గొంటోంది. ఈసారి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగియనుంది. దీని తర్వాత, గౌతమ్ గంభీర్‌ను టీమిండియా తదుపరి ప్రధాన కోచ్‌గా నియమించవచ్చు. అనేక మీడియా నివేదికల ప్రకారం, ప్రధాన కోచ్ పదవి కోసం చాలా మంది మాజీ క్రికెటర్లను సంప్రదించారు. అయితే వారిలో ఎక్కువ మంది నిరాకరించారు.
ఈరోజు గౌతమ్ గంభీర్ ఇంటర్వ్యూ..
ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ పేరు తెరపైకి వచ్చింది. అతను ఈ రేసులో అగ్రగామిగా నిలిచాడు. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ IPL 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ పేరు తొలి ప్రాధాన్యతను దక్కించుకుంది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయడంతో.. బీసీసీఐ అతడిని ఈరోజు ఇంటర్వ్యూ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత టీమిండియా హెడ్ కోచ్‌గా ప్రకటిస్తారని తెలుస్తోంది.
టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకాన్ని జూన్ నెలాఖరులోగా ప్రకటించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో గంభీర్ ఇంటర్వ్యూకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ స్వయంగా టీమ్ ఇండియా హెడ్ కోచ్ కావాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. ఇంతకంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదంటూ చెప్పుకొచ్చాడు.
గత పదేళ్లుగా టీమ్‌ఇండియాకు ఐసీసీ టైటిల్ దక్కలేదు. చాలా మంది కోచ్‌లు వచ్చినా ఐసీసీ టోర్నీలో జట్టును గెలిపించలేకపోయారు. మరి రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని టీమిండియా ఈసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంటుందా లేదా అనేది చూడాలి.