BCCI New Clothing Partner : టీమిండియా క్లాతింగ్ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ చూపు
BCCI New Clothing Partner : టీమిండియా క్రికెట్ జట్టుకు క్లాతింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోన్న ప్రఖ్యాత సంస్థ ‘నైకీ’తో సెప్టెంబరుతో ఒప్పందం ముగియనుంది.
BCCI New Clothing Partner : టీమిండియా క్రికెట్ జట్టుకు క్లాతింగ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోన్న ప్రఖ్యాత సంస్థ 'నైకీ'తో సెప్టెంబరుతో ఒప్పందం ముగియనుంది. జెర్సీ హక్కుల కొత్త ఒప్పందం కోసం ప్రతిపాదనలు ఆహ్వానించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియను బీసీసీఐ వచ్చే వారంలో మొదలెట్టే అవకాశాలున్నాయి. ఆ సంస్థ నాలుగేళ్ల పాటు బీసీసీఐతో 2016లో ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందం విలువ కంటే దాదాపు 31 శాతం తక్కువకే లోగో హక్కులు అమ్మే సూచనలు కనిపిస్తున్నాయి. నైకీ తమ బ్రాండ్‌ను ప్రమోట్ కోసం ఇప్పటి వరకు ప్రతీ అంతర్జాతీయ మ్యాచ్‌కు 88 లక్షల రూపాయల చొప్పున బోర్డుకు చెల్లించింది. ఏడాదికి మరో ఆరు కోట్ల రూపాయలు మినిమం గ్యారంటీ, 15 శాతం రాయల్టీతో పాటు సుమారు 10 కోట్ల రూపాయలు విలువైన నైకీ ఉత్పత్తులు కూడా అందించింది. ఇదంతా కలిపి నాలుగేళ్లలో 220 మ్యాచ్‌లు జరిగేలా ఒప్పందం కుదిరింది.
అయితే కరోనా కారణంగా ప్రపంచ మార్కెట్ స్తంభించింది. అన్ని రంగాలు సమస్యలు ఎదుర్కొంటుండటంతో ఏ రూపంలోనైనా స్పాన్సర్‌షిప్ మొత్తం తగ్గుదల కనిపించవచ్చని బీసీసీఐ అంచనా వేసింది. కాగా తాజాగా ప్రకటించబోయే రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ)లో బేస్ ప్రైస్... విలువను తగ్గించాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మొత్తం రూ. 61 లక్షలుగా ఉండవచ్చు.. పైగా కంపెనీలు పలు సడలింపులు కోరుతూ షరతులు కూడా పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంతో పోలిస్తే ఇది 31 శాతం తక్కువ కావడం విశేషం. మొత్తానికి కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కుదెలయ్యాయి.