T20 World Cup: పరిస్థితులు మెరుగైతేనే ఇక్కడ... లేదంటే యూఏఈలోనే!
T20Worldcup: టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం ఐసీసీని మరికాస్త గడువు అడిగినట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు.
T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం ఐసీసీని మరికాస్త గడువు అడిగినట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. దేశంలో కరోనా పరిస్థితుల నుంచి త్వరలోనే బయటపడతాయనే ధీమా వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఇండియానే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నాడు.
బీసీసీఐ ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్‌ను నిర్వహించాల్సి ఉంది. ఐపీఎల్ 2021 ను విజయవంతంగా పూర్తి చేస్తే.. భారత్‌లోనే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగాటోర్నీ నిర్వహించొచ్చని బీసీసీఐ భావించింది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ఐపీఎల్ 2021 నిరవధికంగ వాయిదా పడింది. దీంతో టీ20 ప్రపంచకప్‌పై సందిగ్ధం నెలకొంది.
ఇండియాలో ఆడే పరిస్థితులు సజావుగా లేకుంటే యూఏఈకి తరలిస్తామని ఐసీసీ గతంలో తెలిపింది. కాగా, సెప్టెంబర్‌లో ఐపీఎల్ సెకండ్ సీజన్‌ను యూఏఈలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో టీ20 వరల్డ్‌కప్‌ను కూడా అక్కడే నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది.