India vs England: ఆఖరి రెండు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే

Update: 2021-02-17 12:06 GMT

టీం ఇండియా  ఫైల్ ఫోటో 

ఇంగ్లాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి రెండు టెస్టులకు భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. జట్టులో ఒక మార్పు మినహా తొలి రెండు టెస్ట్‌లకు ఆడిన జట్టునే కొనసాగిస్తోంది. యువ పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను విజయ్ హజారే ట్రోఫీ కోసం చివరి రెండు టెస్టులకు పక్కన పెట్టింది. గాయం నుంచి కోలుకున్న ఉమేశ్ యాదవ్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఫిట్​నెస్​ పరీక్ష తర్వాత ఉమేశ్ యాదవ్ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 24-28 వరకు అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్ట్(డై/నైట్) జరగనుండగా.. మార్చి 4 నుంచి 8 వరకు ఇదే వేదికపై ఆఖరి టెస్ట్ జరగనుంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్ ఆదే వేదికగా జరిగిన.. రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమానంగా నిలిచాయి. చివరి రెండు టెస్ట్‌ల్లో కూడా గెలిచి గా టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని ఇరు జట్లు భావిస్తోన్నాయి.

చివరి రెండు టెస్టులకు భారత జట్టు:

విరాట్​ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్​మన్ గిల్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, రిషభ్ పంత్, వృద్దీమాన్ సాహా, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఉమేశ్​ యాదవ్. స్టాండ్ బై: కేఎస్ భరత్, రాహుల్ చాహర్..నెట్ బౌలర్లు: అంకిత్ రాజ్‌పుత్, సౌరభ్ కుమార్‌,అవేశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్ ఉన్నారు

Tags:    

Similar News