Nita Ambani: ఒలింపిక్స్, పారాలింపిక్స్ అంబానీ విందు.. హాజరైన 140 మంది అథ్లెట్లు
Nita Ambani: ఒలింపిక్స్, పారాలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్లకు అంబానీ ఫ్యామిలీ గ్రాండ్ గా విందు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విందులో దాదాపు 140మంది అథ్లెట్లు పాల్గొన్నారు.
Nita Ambani: రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యురాలు నీతా అంబానీ ముంబైలోని తన నివాసం యాంటిలియాలో భారత ఒలింపిక్స్, పారాలింపిక్స్ అథ్లెట్లకు విందు ఇచ్చారు. ప్రపంచ క్రీడా రంగంలో గుర్తింపు పొందిన వివిధ విభాగాలకు చెందిన క్రీడాకారులను ఆమె సత్కరించారు. ఆదివారం సాయంత్రం ముంబయిలోని తన నివాసం యాంటీలియానకు 140మంది అథ్లెట్లను పిలిపించి మరీ ప్రత్యేక విందు ఇచ్చారు. ఆదివారం రాత్రి ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ స్పెషల్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
నీరజ్ చోప్రా, మను భాకర్, మురళీకాంత్ పేట్కర్, దేవేంద్ర ఝఝరియాలతో సహా భారతదేశ ఒలింపిక్, పారాలింపిక్ ఛాంపియన్‌లతో పాటు సుమిత్ అంటిల్, నితేష్ కుమార్, హర్విందర్ సింగ్, ధరంబీర్ నైన్, నవదీప్ సింగ్, ప్రవీణ్ కుమార్ దీపా మాలిక్, సానియా వంటి క్రీడా దిగ్గజాలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. మీర్జా, కర్ణం మల్లీశ్వరి, పుల్లెల గోపీచంద్, హర్భజన్ సింగ్ కూడా హాజరయ్యారు. భారత మాజీ దిగ్గజ గోల్‌కీపర్ పిఆర్ శ్రీజేష్ తన కుటుంబంతో సహా ఆంటిలియాకు చేరుకున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన పారా-షట్లర్లు సుహాస్ యతిరాజ్, నితేష్ కుమార్ కూడా ఈ ఈవెంట్‌ను కు వచ్చారు. నీరజ్ చోప్రా, మను భాకర్ ,లక్ష్య సేన్ పాల్గొన్న వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. భారతదేశపు స్టార్ అథ్లెట్లతో పాటు, బాలీవుడ్ నటులు కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అంతేకాదు, యావత్ భారతదేశం మన క్రీడాకారులను చూసి గర్విస్తోందని, 'యునైటెడ్ వి ట్రయంఫ్' ఉద్యమంగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు నీతా అంబానీ తెలిపారు. "ఇది చాలా ప్రత్యేకమైన సాయంత్రం. మొదటిసారిగా, భారతదేశం పారిస్ ఒలింపియన్లు, పారా-ఒలింపియన్లు ఒకే వేదికపై సమావేశమవుతున్నారు. మేము వారిని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నాము. భారతీయులందరూ ప్రతి ఒక్కరికి గర్వపడుతున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ తరపున వారిపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని వారికి తెలియజేస్తున్నాం, 'యునైటెడ్ వుయ్ ట్రయంఫ్' ఒక ఉద్యమంగా మారాలని కోరుకుంటున్నాం" అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు.