IND vs BAN: వింత కారణంతో టీమిండియాతో మ్యాచ్‌కు దూరమైన బంగ్లా వైస్ కెప్టెన్.. ఎందుకో తెలుసా?
IND vs BAN: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 8లో టీమిండియాతో తలపడిన బంగ్లాదేశ్ జట్టు నుంచి వైస్ కెప్టెన్ ఆడలేదు.
IND vs BAN: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 8లో టీమిండియాతో తలపడిన బంగ్లాదేశ్ జట్టు నుంచి వైస్ కెప్టెన్ ఆడలేదు. అందుకు గల కారణం తాజగా బయటకు వచ్చింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వైస్‌కెప్టెన్ తస్కిన్ అహ్మద్ దూరమైన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీం 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత్ ఇచ్చిన టార్గెట్‌ను చేరుకోలేకపోయింది. నిర్ణీత ఓవర్లు ఆడినా 146 పరుగులకే పరిమితమైంది.
అతిగా నిద్రపోవడంతో..
బంగ్లాదేశ్ వైస్‌కెప్టెన్ తస్కిన్ అహ్మద్ నిర్ణత సమయానికి బస్ అందుకోలేపోయాడంట. దీనికి అసలు కారణం కూడా వెలుగులోకి వచ్చింది. అతిగా నిద్రపోవడంతో.. చాలా లేట్‌గా లేచాడంట. దీంతో జట్టు సభ్యులతో కలిసి బస్సులో వెళ్లలేకపోయాడంట. ఆ తర్వాత జట్టులో చేరినా అప్పటికే టాస్ వేయడం, ప్లేయింగ్ 11ను ప్రకటించడం జరిగిపోయిందంట. దీంతో ఈ మ్యాచ్‌లో ఆడలేదంట.
ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) వివరణ ఇచ్చింది. అయితే, తస్కిన్ అహ్మద్ తన తోటి ఆటగాళ్లతో పాటు బీసీబీకి క్షమాపణలు చెప్పాడంట. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో బంగ్లా జట్టు సూపర్ 8 దశను చేరుకోలేకపోయింది.