Bangladesh Vs Australia T20I: మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆసీస్ పై ఘన విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు టీ20 లలో ఒక్కసారి కూడా గెలుపొందని బంగ్లా జట్టు మొదటి సాటి అంతర్జాతీయ టీ20లో విజయంతో కంగారులను కంగారెత్తించింది. మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు హజెల్వుడ్ 4-24-3, స్టార్క్ 4-33-2 తమదైన బౌలింగ్ తో బంగ్లా ఆటగాళ్ళను 131/7 పరుగులకు కట్టడి చేశారు. బంగ్లా బ్యాటింగ్ లో నయీం 30, షాకిబ్ 36, హుసైన్ 20 మినహా ఎవరు రాణించకపోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు.
ఇక 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు ఆదిలోనే అలెక్స్ కారీ డక్ అవుట్ అవడంతో మిచెల్ మార్ష్ 45 ఒంటరి పోరాటం చేశాడు. మార్ష్ మినహా ఆసీస్ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్ మెన్ రాణించకపోవడం, బంగ్లా బౌలర్ నసుం అహ్మద్ తన అద్భుత బౌలింగ్ తో టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చడంతో ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 108 పరుగులకే అల్ అవుట్ అయి బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. నాలుగు వికెట్స్ తో మంచి ప్రదర్శన కనబరిచిన నసుం అహ్మద్ 4-19-4 కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. ఇక అయిదు టీ 20 మ్యాచ్ లో భాగంగా బంగ్లా 1-0 తో ముందంజలో ఉంది. బుధవారం ఆసీస్ తో రెండో టీ 20లో బంగ్లా ఢాకా స్టేడియంలో తలపడబోతుంది.