Australia - Zimbabwe ODI Series Postponed: ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20ప్రపంచ కప్ పై నీలినీడలు
Australia - Zimbabwe ODI Series Postponed: కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. ఈ మహమ్మారి దాటి క్రీడా రంగం కుదేలైంది.
Australia - Zimbabwe ODI Series Postponed: కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. ఈ మహమ్మారి దాటి క్రీడా రంగం కుదేలైంది. అన్ని అంతర్జాతీయ టోర్నీలు వాయిదా పడ్డాయి. మూడు నెలలకు పైగా అన్ని క్రీడలూ స్తంభించిపోయిన వేళ ఇప్పుడిప్పుడే కొన్ని ఆటలు తిరిగి ప్రారంభమవుతున్నాయి.
అయితే, క్రికెట్‌కు కాస్త సమయం పట్టే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో ఆగస్టులో ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 9 నుంచి 15 వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఈ సిరీస్‌ను నిర్వహించాలని ముందే నిర్ణయించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అది నిర్వహించడం మంచిదికాదని భావించిన రెండు దేశాల జట్ల బోర్డులు ఇష్టపూర్వకంగానే వాయిదా వేయడానికి ఒప్పుకున్నాయి. పరిస్థితులను బట్టి రాబోయే కాలంలో మళ్లీ ఈ సిరీస్‌ను కొనసాగిస్తామని సీఏ పేర్కొంది. క్రికెటర్లు సహాయక సిబ్బంది, అభిమానులు అందరి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
అయితే, ఈ ఏడాది చివర్లో భారత్‌తో ఆడాల్సిన సిరీస్‌లను నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రణాళికలు రూపొందించిన సంగతి తెలిసిందే. మరోవైపు అక్టోబర్ నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 15 జట్ల ఆటగాళ్లను సమన్వయం చేయడం కష్టతరమని ఆసీస్ చెప్పింది. అయితే, ఐసీసీ మాత్రం ఈ మెగా ఈవెంట్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునేందుకు సమావేశం కానుంది.
ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా చివరిసారిగా మార్చి 13న న్యూజిలాండ్‌తో సిడ్నీ గ్రౌండ్‌లో తలపడింది. అది కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించారు. తర్వాత ఆ దేశంలో లాక్‌డౌన్ విధించడంతో అప్పటి నుంచీ ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. ఇప్పటవరకూ 7,832 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 7037మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 104మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. లాక్ డౌన్ అంక్షలను సడలిస్తూ వస్తుంది. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసింది. కాగా.. డొమెస్టిక్ సర్వీసులను తిరిగి ప్రారంభించింది.