Australia vs India: 2003లో సేమ్ టెస్ట్.. శార్దూల్, వషీ పోరాటంపై సెహ్వాగ్ చెప్పిన టెస్టు ఇదే
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో మూడో రోజు కీలక బ్యాట్స్ మెన్స్ ఔట్ కావడంతో.. శార్దూల్, సుందర్ మేటి ఆట ఆడారు. నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొని క్లిష్ట సమయంలో అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 115 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన దశలో శార్దూల్, వషీ గుర్తుండిపోయే భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక శార్దూల్ ఠాగూర్, వాషింగ్టన్ సుందర్ పోరాటపటిమపై అటు మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరిపై ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ , మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గతాన్ని గుర్తు చేశారని కొనియాడారు. 2003లో అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టు గుర్తొస్తుందని చెప్పాడు. అప్పుడు కూడా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల వెనుకబడి ఉందని, తాజా గబ్బా టెస్టులోనూ అదే జరిగిందని అన్నాడు. 133 పరుగుల ఆదిక్యం లభిస్తుందని భావించిన ఆసీస్‌కు శార్దూల్, వషీ పోరాటంతో 33 పరుగులు మాత్ర దక్కాయని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆసీస్ నలుగురు బౌలర్లకు 1000 వికెట్లు తీసిన అనుభవం ఉండగా.. గబ్బా టెస్టులో టీమిండియా ఐదుగురు బౌలర్లకు 11 వికెట్లు తీసిన అనుభవమే ఉన్నా వారి అద్భుత ఆటతీరు జబర్దస్త్‌గా ఉందని పేర్కొన్నాడు.
కాగా, 2003 నాటి అడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 556 ఆలౌట్ అయింది. పాంటింగ్ (242).. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 523 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ద్రవిడ్ (233), లక్ష్మణ్ (148) పరుగులు చేశారు. దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆదిక్యం లభించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 196 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆగార్కర్ 6 వికెట్లతో ఆసీస్ వెన్నువిరిచాడు. 230 పరుగుల లక్ష్యాన్ని భారత్ 233 పరుగులు చేసి ఛేధించింది.