Australia vs India: నిలకడగా ఆడుతున్నభారత్
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది.
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు బంతితో,బ్యాట్‌తో భారత్ సత్తాచాటిన టీమిండియా మూడో రోజు తొలి సెషన్ లోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. భారత్ భోజన విరామ సమయానికి 79 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓవర్ నైట్ స్కోరు 96/2 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ రహానే (22, 70 బంతుల్లో) త్వరగానే ఔటైయ్యాడు. హనుమ విహారి(4) రనౌటైయ్యాడు. భోజన సమయానికి పుజారా (42, 144 బంతులు, 4x4) రిషబ్ పంత్ (29 45బంతుల్లో 3x4) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ రెండు , హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టారు.