Boxing Day Test: భారత బౌలర్ల ధాటికి ఆసీస్ విలవిల

భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు.

Update: 2020-12-26 05:37 GMT

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఆసీస్ 134 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్ట్రాల్లో పడింది. తొలుత ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనీ టీమిండియాను బౌలింగ్ కు ఆహ్వానించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు మాథ్యూ వెడ్, జో బర్న్స్ ఆరంభించారు. ఐదవ ఓవర్ రెండో బంతికి బుమ్రా.. బర్న్స్ (0)ను ఔట్ చేశాడు. స్పిన్నర్ అశ్విన్ తన మాయాజాలం చూపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్న్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ టాప్ ఆర్డర్‌ను వణికించాడు. మొదటగా ఓపెనర్ మాథ్యూ వెడ్‌ (30)ను, స్టీవ్ స్మిత్ (0) డకౌట్ చేశాడు. దీంతో ఆసీస్ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇక 11వ ఓవర్లోనే కెప్టెన్ అజింక్య రహానే స్పిన్నర్ రవిచంద్రన్ చేతికి బంతినిచ్చాడు. 13వ ఓవర్ ఐదవ బంతికి వెడ్‌ క్యాచ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజా అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. అశ్విన్ మాయాజాలానికి మరోసారి చిక్కాడు. మార్కస్ లబుషేన్ తన వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేస్తున్నాడు. మార్కస్ లబుషేన్ 48 పరుగుల వద్ద మహమ్మద్‌ సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ చేతికి చిక్కి డకౌట్ ఆయిన స్మిత్..ఈ మ్యాచ్ లో పుజారా క్యాచ్ ఇచ్చి మళ్లీ అదే పునరావృతం చేశాడు.

ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనీ, గ్రీన్ సహకారంతో ఇన్నింగ్స్ అందిస్తున్నాడు. మూడో సెషన్ లో 60 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది క్రీజులో టిమ్ పైనీ (13), గ్రీన్ (10) పరుగులతో ఉన్నారు. మొత్తానికి మొదటి రెండు సెషన్లో టీమిండియా ఆధిపత్యం చెలాయించింది.

Tags:    

Similar News