Australia Squad vs India: భారత్‌తో టెస్ట్‌కు ఆస్ట్రేలియా టీమ్ ప్రకటన.. తొలిసారి ఆ కెప్టెన్‌కు చోటు

Update: 2024-11-10 14:30 GMT

Australia Squad vs India: భారత్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు సిద్ధమవుతోంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా తొలి టెస్టు పెర్త్‌ వేదికగా నవంబర్ 22 నుంచి మొదలు కానుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 5 మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. 13 మందితో కూడిన జట్టును తాజాగా ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆసీస్ జట్టులోకి ఓ కొత్త ప్లేయర్‌ వచ్చాడు. భారత్‌-ఏతో అనధికారిక టెస్టుల్లో ఆస్ట్రేలియా-ఏకు సారథ్యం వహించిన నాథన్ మెక్‌స్వీనేకు అవకాశం దక్కింది. గాయం కారణంగా కామెరూన్‌ గ్రీన్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మీడియా ప్రకారం, పెర్త్‌లో అతని టెస్టు అరంగేట్రం ఖాయం. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోగలడా అనేది చెప్పడం కష్టం.

నాథన్‌కి ఎందుకు అవకాశం వచ్చింది?

25 ఏళ్ల బ్యాట్స్‌మెన్ నాథన్ మెక్‌స్వీన్ ఓపెనింగ్ రేసులో ముందంజలో ఉన్నాడు. అతని సెలక్షన్‌పై క్రికెట్ ఆస్ట్రేలియాకు అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, ఒకవైపు, అతను ఇతర ఆటగాళ్ల కంటే టీమిండియా A కి వ్యతిరేకంగా చాలా మెరుగైన పర్‌ఫార్మెన్స్ చూపించాడు. రికీ పాంటింగ్, టిమ్ పైన్ వంటి దిగ్గజాలు కూడా రెండవ ఓపెనర్ పాత్ర కోసం అతని పేరును సమర్థించారు. ఇటీవల భారత్ Aతో ముగిసిన రెండు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నాథన్ నిలిచాడు. అతను 55.33 సగటుతో 166 పరుగులు చేశాడు.

వైట్ బాల్ క్రికెట్‌లో, ఆస్ట్రేలియా జట్టు వికెట్ కీపర్ .. ప్రస్తుత యాక్టింగ్ కెప్టెన్ జోష్ ఇంగ్లిస్ టెస్ట్ జట్టులో షాకింగ్ ఎంట్రీ ఇచ్చాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు అతనికి బహుమతి లభించింది. అయితే అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి.

పెర్త్‌ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

ఫాస్ట్ బౌలర్లలో జట్టులో స్థానం సంపాదించడంలో స్కాట్ బోలాండ్ సక్సెస్ అయ్యాడు. పెర్త్‌ టెస్టుకు ఎంపికైన ఆస్ట్రేలియా జట్టును పాట్‌ కమిన్స్‌ సారథ్యం వహించే జట్టును ఒకసారి చూద్దాం. పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, జోష్ ఇంగ్లిస్, జోష్ హాజిల్‌వుడ్. భారత్ - ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరగనుంది.

Tags:    

Similar News