ఆస్ట్రేలియా స్టార్ బాట్స్ మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. భారత సంతతికి చెందిన విని రామన్‌తో మాక్స్‌వెల్ నిశ్చితార్థం తాజాగా జరిగింది. భారత సంప్రదాయాల ప్రకారమే వీరి నిశ్చితార్థం జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటివల నిశ్చితార్థం అయిన ఫోటోలను విని రామన్‌తో పాటు మాక్స్‌వెల్ సోషల్ మీడియాలో ప్రకటించారు. మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి విని రామన్. ఆమె ఓ ఫార్మాసిస్ట్.
ఇక వీరి ఎంగేజ్‌మెంట్ పై ఆసీస్ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఇంకా వీరి పెళ్లి డేట్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. గతంలో ఆసీస్ బాట్స్ మెన్ షాన్ టైట్ మాషుమ్ సింఘా అనే భారత యువతినే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ లిస్టులోకి మాక్స్‌వెల్ కూడా చేరిపోయాడు. ఇక గత కొద్దిరోజులుగా మోచేతి గాయం కారణంగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న గ్లెన్ మాక్స్‌వెల్ మళ్ళీ ఐపీఎల్ 2020 సీజన్ తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. కానీ ప్రస్తుతం ఐపీఎల్ ని ఏప్రిల్ 15 వరకి వాయిదా వేశారు..