SA vs AUS: దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం.. ఫైనల్‌లో భారత్‌తో ఢీ
SA vs AUS: 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
SA vs AUS: ఆస్ట్రేలియా టీమ్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన ఆసీస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆసీస్ మధ్య ఆఖరి పోరు జరగనుంది.
సౌతాఫ్రికా టీమ్ మరోసారి సెమీస్ ఫైట్‌లో బోల్తా కొట్టింది. గతంలో నాలుగు సార్లు సెమీస్‌లోనే ఓడిన సఫారీలు.. ఇవాళ కూడా పోరాడినా చివరకు ఫలితం మాత్రం దక్కకుండా పోయింది. కోల్‌కతా వేదికగా జరిగిన రెండో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్క్, హాజిల్‌వుడ్ సౌతాఫ్రికా టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. అనంతరం మిల్లర్ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించగా.. మరో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ క్లాసీన్ 47 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించకపోవడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇక 213 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 215 రన్స్ చేసింది.
అయితే 212 పరుగుల స్వల్ప స్కోరు చేసినా.. ఆ స్కోరును కాపాడుకునేందుకు సౌతాఫ్రికా తీవ్రంగా శ్రమించింది. ఓ దశలో బ్యాట్స్‌మెన్‌లు ఒక్కొక్కరుగా పెవిలియన్ బాట పట్టడంతో టెయిలెండర్లపైనే భారం పడింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఆఖర్లో వికెట్లు దక్కకపోవడంతో కంగారూ టీమ్‌ను విజయం సాధించింది. 8వ వికెట్‌కు స్టార్క్, కమిన్స్ 23 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు విజయాన్ని అందించారు.