AUS vs IND Border Gavaskar Trophy : ఆస్ట్రేలియాతో తొలి టెస్టు..రోహిత్ శర్మ దూరం..మరీ కెప్టెన్ ఎవరంటే?

Update: 2024-11-18 02:57 GMT

Rohit Sharma: రోహిత్ శర్మ స్థానంలో కొత్త కెప్టెన్.. ఎవరో తెలుసా..? 

AUS vs IND Border Gavaskar Trophy :ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య మరో నాలుగు రోజుల్లో బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ సిరీస్ షురూ కానుంది. పెర్త్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈసారి కూడా సిరీస్ తో ట్రోఫీ చేజిక్కించుకునేందుకు కసిగా ఉన్న భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుని ప్రాక్టీస్ కూడా చేస్తోంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య డెలివరీ కావడంతో భారత్ లోనే ఉన్నారు. హిట్ మ్యాన్ సతీమణి రితికా సజ్దే మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పితృత్వాన్ని ఆస్వాదించేందుకు రోహిత్ మరికొన్ని రోజులు భారత్ లోనే ఉండనున్నారట.

అందుకే మొదటి టెస్టుకు తాను అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ, సెలక్షన్ కమిటీకి రోహిత్ శర్మీ తెలిపినట్లు సమాచారం. కానీ ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఒకవేళ రోహిత్ శర్మ నిజంగానే అందుబాటులో లేనట్లయితే వైస్ కెప్టెన్ గా ఉన్న జస్ ప్రీత్ బుమ్రా పెర్త్ టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తాడని తెలుస్తోంది. అంతకుముందు కూడా బుమ్రా ఓసారి భారత టెస్టు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు. 2022లో ఎడ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ తో మ్యాచుకు ముందు హిట్ మ్యాన్ కోవిడ్ బారినపడి, పూర్తి ఫిట్‌నెస్ లేకపోవడం వల్ల బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు.

ఇక ఆడిలైడ్ లో జరిగే రెండో టెస్టుకు ముందు రోహిత్ జట్టులో చేరనున్నట్లు సమాచారం. మొదటి టెస్టుకు ముందే హిట్ మ్యాన్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని అనుకున్నాం. కానీ అతను తనుకు మరికొంత సమయం కావాలని..ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లలేనని బీసీసీఐకి చెప్పారు. బీసీసీఐ అతని నిర్ణయాన్ని గౌరవించింది. రోహిత్ శర్మ ఆడిలైడ్ లో జరిగే పింక్ బాల్ టెస్టుకు ముందు జట్టుతో కలుస్తాడు. మొదటి టెస్టుకు, రెండో టెస్టుకు మధ్య 9 రోజుల గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఆ సమయానికి హిట్ మ్యాన్ ఆస్ట్రేలియాకు చేరుకుంటాడని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Tags:    

Similar News