Asia Cup 2023: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఉచితంగా ఆసియాకప్, వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడొచ్చు.. ఎలాగంటే?
Asia Cup 2023 Live Streaming: ఆసియా కప్ 1984 నుంచి నిర్వహించనున్నారు. ఈ టోర్నీ 16వ ఎడిషన్ ఆగస్టు 30 నుంచి పాకిస్థాన్‌లో జరగనుంది.
Asia Cup 2023 Live Streaming: ఆసియా కప్ 1984 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ 16వ ఎడిషన్ ఆగస్టు 30 నుంచి పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీ 6 జట్ల మధ్య జరగనుంది. ఆసియా కప్ తర్వాత వన్డే ప్రపంచ కప్ 2023 అక్టోబర్-నవంబర్‌లో జరగనుంది. ఈ రెండు టోర్నీలు భారత క్రికెట్ జట్టుకు చాలా కీలకం కానున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ టోర్నమెంట్‌ల మ్యాచ్‌లను అభిమానులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యాచ్‌లను ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ఆసియా కప్‌లోని అన్ని మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడొచ్చు. ఆసియా కప్, ODI ప్రపంచ కప్ మ్యాచ్‌లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మొబైల్‌లో చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టా ఈసారి మొబైల్ వినియోగదారులకు ఆసియా కప్, ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌నకు సభ్యత్వం అవసరం లేదని ప్రకటించింది. అంటే, మీరు ఈ కంటెంట్ మొత్తాన్ని ఉచితంగా ప్రసారం చేయవచ్చు. అయితే ఇంతకు ముందు క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హోస్ట్‌పై చందా తీసుకోవాల్సి వచ్చేది.
ఈ కారణంగా మ్యాచ్‌లు ఉచితంగా చూడొచ్చు..
IPLలో రికార్డ్ బ్రేకింగ్ వ్యూయర్‌షిప్ తర్వాత, డిస్నీ స్టార్ మొబైల్ వినియోగదారుల కోసం ప్రపంచ కప్, ఆసియా కప్ మ్యాచ్‌లకు సభ్యత్వాన్ని ఉంచకూడదని నిర్ణయించుకుంది. విడుదల ప్రకారం, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను ఉచితంగా చూపించడంతో క్రికెట్ ఆటను మరింత మందికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉంది. దీని ద్వారా కంపెనీ క్రికెట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను భారతదేశంలోని ఎక్కువ మంది మొబైల్ వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కూడా యోచిస్తోంది. అదే సమయంలో, 540 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు దీని నుంచి ప్రయోజనం పొందుతారని కంపెనీ పేర్కొంది.
ఆసియా కప్ 2023 షెడ్యూల్..
ఆగస్ట్ 30: పాకిస్థాన్ vs నేపాల్, ముల్తాన్
ఆగస్టు 31: బంగ్లాదేశ్ vs శ్రీలంక, కాండీ
సెప్టెంబర్ 2: పాకిస్థాన్ vs ఇండియా, క్యాండీ
సెప్టెంబర్ 4: ఇండియా vs నేపాల్, క్యాండీ
సెప్టెంబర్ 5: ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక, లాహోర్
సూపర్-4..
సెప్టెంబర్ 6: A1 Vs B2, లాహోర్
సెప్టెంబర్ 9: B1 Vs B2, కొలంబో
సెప్టెంబర్ 10: A1 Vs A2, కొలంబో
సెప్టెంబర్ 12: A2 Vs B1, కొలంబో
సెప్టెంబర్ 14: A1 Vs B1, కొలంబో
సెప్టెంబర్ 15: A2 Vs B2, కొలంబో
సెప్టెంబర్ 17: ఫైనల్, కొలంబో