Asia Cup 2021: ఆసియా కప్ ను నిర్వహించలేం -శ్రీలంక క్రికెట్ బోర్డు

Asia Cup 2021: క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ రద్దు అయింది.

Update: 2021-05-20 06:44 GMT

ఆసియా కప్ రద్దు (ఫొటో ట్విట్టర్)

Asia Cup 2021: క్రికెట్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ రద్దు అయింది. శ్రీలంకలో జరగాల్సిన ఈ సిరీస్.. అక్కడ కరోనా కేసులో భారీగా పెరగుతుండడంతో... శ్రీలంక బోర్డు చెతులెత్తేసింది. ఈ మేరకు ఆసియా కప్‌ని నిర్వహించడం కష్టమంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో యాష్లె డిసిల్వా ప్రకటించాడు.

కాగా, కోవిడ్ కేసుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలపై పది రోజుల నిషేధం విధించింన సంగతి తెలిసిందే. అయితే, ఆసియా కప్ గతేడాది ఏడాది పాకిస్థాన్ లో జరగాలి. కానీ, టీమిండియా ఆ దేశం వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సూచించింది.

అంతా సజావుగా సాగుతున్న టైంలో.. శ్రీలంకలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో.. ఈ ఏడాది కూడా ఆసియా కప్ వాయిదా పడింది. శ్రీలంక క్రికెట్ బోర్డు ఆసియా కప్ నిర్వహించలేమని చేతులెత్తేయడంతో.. ఈ టోర్నీ భవితవ్యం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చేతుల్లో ఉంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాతే మళ్లీ ఆసియా కప్ టోర్నీ జరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ఆసియా కప్ రద్దుతో.. టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపైనా నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఇండియా వేదికగా ఈ ఏడాది పొట్టి ప్రపంచ కప్ టోర్నీ అక్టోబరు- నవంబరులో జరగాల్సి ఉంది. మనదేశంలోనూ కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఆటగాళ్లకు కరోనా సోకడంతో.. ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ టోర్నీని యూఏఈ మార్చాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయమై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News