IND vs AUS: డ్రాగా ముగిసిన అహ్మదాబాద్ టెస్ట్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా
IND vs AUS: 2-1 తేడాతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన నాలుగో టెస్టు ఫలితం తేలకుండానే డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని మ్యాచ్‌ను నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. అంపైర్లు ఈ టెస్టు డ్రా అయినట్లు ప్రకటించారు. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు టెస్టుల్లో భారత్ విజయం సాధించగా.. మూడో టెస్టును ఆసీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ.. టీమ్ ఇండియా WTC ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ ఫలితం తేలకముందే.. న్యూజిలాండ్ చేతిలో లంక ఓటమితో రోహిత్ సేన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి చేరింది.