11 ఏళ్ల తరవాత పోటి పడుతున్న కోహ్లి , విలియమ్సన్..

Update: 2019-07-07 07:53 GMT

దాదాపుగా 11ఏళ్ల తరవాత పోటిపడుతున్నారు ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరియు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్.. గతంలో వీరు 2008 అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన సెమిస్ మ్యాచ్ లో పోటికి దిగారు . అప్పుడు ఇరు జట్ల కెప్టెన్స్ వీరే కావడం విశేషం .. మలేషియా వేదికగా ఈ మ్యాచ్ జరగగా అ మ్యాచ్ లో భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది . ఇందులో మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణిత 50 ఓవర్ లో 205 పరుగులు చేసింది .

అ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 43 ఓవర్లకు గాను 191 పరుగులు చేసింది . కానీ అ మ్యాచ్ కి వర్షం అడ్డు పడడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ మూడు వికెట్ల తేడాతో విజుయం సాధించినట్లు ప్రకటించారు .. మళ్ళీ ఈ ఇద్దరు కెప్టెన్స్ దాదాపుగా 11ఏళ్ల తరవాత ప్రపంచ కప్ లో పోటికి దిగబోతున్నారు .. ఇది కూడా సెమిస్ కావడం ఇక్కడ మరో పాయింట్ .. మరి ఇందులో ఈ సారి ఎవరిదీ పై చేయి అవుతుంది అన్నది చూడాలి మరి ..ఈ ప్రపంచ కప్ లో వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే ..
 

 

Tags:    

Similar News