Afghanistan vs Sri Lanka: వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. శ్రీలంకను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్‌

Afghanistan vs Sri Lanka: శ్రీలంక జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం

Update: 2023-10-31 02:11 GMT

Afghanistan vs Sri Lanka: వరల్డ్‌కప్‌లో మరో సంచలనం.. శ్రీలంకను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్‌

Afghanistan vs Sri Lanka: పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ వరల్డ్‌కప్‌‌లో సంచలన విజయాలకు తెరతీసింది. తమ నిలకడైన ప్రదర్శనతో... తమ కంటే మెరుగైన జట్లను మట్టి కరిపిస్తూ.. ఔరా అనిపిస్తోంది. తాము ఇక పసికూనలం కాబోమంటూ సంకేతాలిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఆఫ్ఘాన్ జట్టు ఆ తర్వాత పాక్‌ను ఓడించి షాకిచ్చారు. ఆదివారం జరిగిన మ్యాచులో శ్రీలంక జట్టుపై కూడా ఘన విజయాన్ని అందుకున్నారు.

ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచుతో ఆఫ్ఘనిస్తాన్ మూడో విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. నిస్సంక 49, కుశల్ మెండిస్ 39, తీక్షణ 29 పరుగులు చేశారు. ఆఫ్ఘా్న్ బౌలర్‌ ఫజల్ హక్‌ నాలుగు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బతీశాడు.

ఇక 242 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 45.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గుర్బాజ్ డకౌట్/icc-world-cup-2023-afghanistan-won-by-7-wkts అయినా.. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ నిలకడగా ఆడారు. రహ్మత్ షా 62 పరుగులు చేయగా.. షాహిది 58 పరుగులు.. ఒమర్‌జాయ్‌ 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. తొలి మ్యాచులో ఇండియాతో ఓడిన ఆఫ్ఘాన్ రెండో మ్యాచులో ఇంగ్లండ్‌ను ఓడించింది. మూడో మ్యాచులో న్యూజింలాండ్ చేతిలో ఓటమి పాలవగా.. నాలుగో మ్యాచులో పాకిస్తాన్‌‌పై విజయం సాధించింది. అదే జోష్‌లో శ్రీలంకను కూడా ఓడించి ఐసీసీ వరల్డ్‌కప్‌ టోర్నీలో తొలిసారి 3 విజయాలు అందుకుంది. 

Tags:    

Similar News