వరుణుడు దోబూచులాడిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు 36.5 ఓవర్లకు 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వర్షం కారణంగా దాదాపు రెండున్నర గంటలపాటు ఆట నిలిచిపోయింది. సవరించిన లెక్కల ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ విజయ లక్ష్యం 41 ఓవర్లలో 187 పరుగులు. 21 ఓవర్లకు 143/1తో పటిష్ఠంగా ఉన్న శ్రీలంకను మహ్మద్‌నబీ (4/30) రషీద్ ఖాన్ (2/17), దవ్లత్ ఖాన్(2/32) భారీగా దెబ్బ తీశారు.
ఓపెనర్లు కుశాల్ పెరీరా (78; 81 బంతుల్లో 8×4), దిముతు కరుణ రత్నె (30; 45 బంతుల్లో 3×4) ధాటిగా ఆడి శ్రీలంకకు శుభారంభం అందించారు. జట్టు స్కోరు 92 వద్ద కరుణరత్నెను నబీ ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. లాహిరు తిరుమానె (25)ను జట్టు స్కోరు 144 వద్ద నబీనే పెవిలియన్ పంపించాడు. దీంతో శ్రీలంక వికెట్ల పతనం మొదలైంది. అఫ్గాన్ బౌలర్లు పంజా విసరడంతో కుశాల్ మెండిస్ (2), ఏంజెలో మాథ్యూస్ (0), ధనంజయ డిసిల్వా (0), తిసారా పెరీరా (2), ఇరుసు ఉడాన (10), సురంగ లక్మల్ (15*), లసిత్ మలింగ (4), నువాన్ ప్రదీప్ (0) విలవిల్లారు.