Adam Gilchrist About Harbhajan Singh : హర్భజన్ పై గిల్‌క్రిస్ట్ ఆసక్తికరమైన వాఖ్యలు!
Adam Gilchrist About Harbhajan Singh : ఆస్ట్రేలియా టీంని తన బౌలింగ్ తో బెంబేలెత్తించిన బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకడు.. తన వైవిధ్యమైన
Adam Gilchrist About Harbhajan Singh : ఆస్ట్రేలియా టీంని తన బౌలింగ్ తో బెంబేలెత్తించిన బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకడు.. తన వైవిధ్యమైన దూస్రాలతో కంగారు జట్టును కంగారు పెట్టించేవాడు. అయితే అలాంటి హర్భజన్ పైన ఆ జట్టు మాజీ కీపర్, బ్యాట్స్‌మన్ ఆడం గిల్‌క్రిస్ట్ కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశాడు. తాజాగా 'లైవ్‌కనెక్ట్' కార్యక్రమంలో టీవీ ప్రెజెంటర్ మడోన్నా టిక్సేరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్‌క్రిస్ట్ భజ్జీ గురించి మాట్లాడాడు.. '
టీంఇండియా జట్టుతో ఆడుతున్నప్పుడు తానూ పరుగులు చేస్తున్న సమయంలో ఏమీ అనేవారు కాదని, కానీ ఆ జట్టు బౌలర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ లో మాత్రం అవుట్ అయితే ఎప్పుడూ ఒక మాట అంటుండేవారని గిల్లి చెప్పుకొచ్చాడు. అయితే తనకి ఆ మాట అర్ధం తెలియదని, కనీసం పలకడం కూడా తనకురాదన్నాడు.. ఇక హర్భజన్ టెస్ట్ క్రికెట్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను ఏడుసార్లు అవుట్ చేయగా, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను 10 సార్లు, మాథ్యూ హేడెన్ 9 సార్లు అవుట్ చేశాడు భజ్జీ.. ఇక 2001 లో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత్ కంగారూ లకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు హర్భజన్ సింగ్ చేసిన ఉత్తమ ప్రదర్శనలలో ఇది ఒకటి, దీనిలో ఈ ఆఫ్ స్పిన్నర్ ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు.
ఇక భారత్ లో పర్యటించినప్పటి క్షణాలను గిల్లి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. భారత్ లో పర్యటించిన ప్రతిసారి మంచి ఆతిథ్యం లభిస్తుండేదని గుర్తుచేసుకున్నాడు. ఓ సారి ముంబైలో పర్యటించినప్పుడు ఉదయాన్నే లేచి ఎవరూ గుర్తు పట్టకుండా జాగింగ్‌కు వెళితే అక్కడ స్థానికులు గుర్తుపట్టి తన వెంటపడి, తనతో ఫొటోలు దిగారని అది తనకో మధర జ్ఞాపకమని గుర్తుచేసుకున్నాడు గిల్లి.. త్వరలో మళ్ళీ భారత్ ని సందర్శించాలని ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చాడు.
ఇక గిలిక్రిస్ట్ ఆసీస్ జట్టుకు కీపర్ గా, ఆటగాడిగా చాలా విజయాలను అందించాడు. ఇక ఐపీఎల్‌లో గతంలో డెక్కన్ ఛార్జెర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి రెండో సీజన్ 2009లోనే జట్టును టైటిల్ విజేతగా నిలబెట్టాడు.