పూజ చేసేప్పుడు గంట ఎందుకు కొడతారు? ఆ గంటపై ఏ దేవుడి బొమ్మ ఉంటుందో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిందే..!

Puja: గంటలు లేని దేవాలయాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. సనాతన ధర్మంలో గంట లేకుండా పూజ పూర్తి కాదు. గంట మోగించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది.

Update: 2023-05-23 00:30 GMT

పూజ చేసేప్పుడు గంట ఎందుకు కొడతారు? ఆ గంటపై ఏ దేవుడి బొమ్మ ఉంటుందో తెలుసా? తప్పక తెలుసుకోవాల్సిందే..!

Puja: గంటలు లేని దేవాలయాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. సనాతన ధర్మంలో గంట లేకుండా పూజ పూర్తి కాదు. గంట మోగించడానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. గంట శబ్దం వాతావరణంలో సానుకూలతను తెస్తుంది. ఈ విషయం శాస్త్రీయంగా కూడా నిరూపించారు. సాధారణంగా, ఆరతి ఇచ్చేటప్పుడు లేదా ఆరతి తర్వాత, ప్రజలు గంటను మోగించి, తమ కోరికలను దేవునికి తెలియజేస్తారు. కానీ గంటపై ఏ దేవత ఫొటో చెక్కబడి ఉంటుంది, అందుకు గల కారణం ఏంటో తెలుసా?

విశ్వం సృష్టి ధ్వనిలోనే..

పూజలో మోగించే గంటను గరుడ గంట అంటారు. హిందూ మతం ప్రకారం, ప్రపంచ సృష్టి జరిగిన శబ్దం ఈ గరుడ గంట నుంచి ఉద్భవించింది. అందుకే గరుడ గంటికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కాకుండా, పూజ లేదా హారతి సమయంలో గంట మోగించడం ద్వారా, చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి అంతమవుతుంది.

పూజగదిలో గరుడదేవుడు..

గృహాలు, దేవాలయాల పైభాగంలో గరుడ దేవుడి బొమ్మ ఉంటుంది. హిందూ మతంలో గరుడ దేవత విష్ణువు వాహనంగా పేర్కొంటారు. గరుడదేవుని చిత్రం గంటలో చెక్కబడి ఉండటం వెనుక గల కారణం ఏమిటంటే, అది విష్ణువు వాహనం రూపంలో ఉన్న దేవునికి భక్తుల సందేశాన్ని తెలియజేస్తుందని నమ్ముతుంటారు. అందుకే గరుడ గంటను మోగించడం ద్వారా విష్ణువుకు ప్రార్థన చేరుతుందని భావిస్తుంటారు. కోరికలు నెరవేరుతాయని నమ్ముతుంటారు. గరుడ గంటను మోగించడం వల్ల మనిషికి మోక్షం లభిస్తుందని కూడా నమ్ముతారు.

4 రకాల గంటలు..

గంటల గురించి చెప్పాలంటే, గుడి లేదా ఇంట్లో 4 రకాల గంటలు ఉపయోగిస్తుంటారు. గరుడ గంట, డోర్ బెల్, చేతి గంట, గంట ఇలా 4 రకాల గంటలు ఉంటాయి. గరుడ గంట చిన్నది. దీన్ని చేతితో మోగించవచ్చు. దేవాలయాల ప్రవేశద్వారం వద్ద డోర్ బెల్స్ లేదా పెద్ద గంటలు వేలాడదీస్తారు. అవి చిన్నవి లేదా పెద్దవి.

(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి.)

Tags:    

Similar News