Debt Problems: అప్పుల బాధ నుంచి బయటపడలేకపోతున్నారా.. ఇంట్లో ఈ పొరపాట్లు చేయవద్దు..!
Debt Problems: డబ్బుల అవసరం ఎప్పుడు ఏ విధంగా వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఆ సమయంలో మన దగ్గర డబ్బులు ఉంటే పర్వాలేదు లేదంటే అప్పు చేయల్సిందే.
Debt Problems: డబ్బుల అవసరం ఎప్పుడు ఏ విధంగా వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఆ సమయంలో మన దగ్గర డబ్బులు ఉంటే పర్వాలేదు లేదంటే అప్పు చేయల్సిందే. తర్వాత వీటిని తీర్చడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ఎంత సంపాదించినా అప్పుల ఊబిలో నుంచి బయటపడలేకపోతారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఇంట్లో చేసే పొరపాట్లు ఉన్నాయి. ఇవి మీ పై ఎఫెక్ట్ చూపుతాయి. జ్యోతిష్యం ప్రకారం కొన్ని రకాల తప్పులు చేయకూడదు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఇంట్లో ఖాళీ పాత్రలను ఎప్పుడూ స్టవ్‌పై పెట్టి ఉంచకూడదు. మీరు బయటి నుంచి వచ్చి డోర్‌బెల్ కొట్టాక కొంత సమయం వేచి ఉండండి కానీ కాలుతో డోరును తన్నడం లాంటివి చేయవద్దు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూర్చొని ఎప్పుడూ ఆహారం తినకూడదు. లక్ష్మీ దేవి ఈ గుమ్మం నుంచి మాత్రమే ఇంట్లోకి ప్రవేశిస్తుందని గుర్తుంచుకోండి. ఉదయం, సాయంత్రం ఆహారాన్ని వండిన తర్వాత మొదటగా ఆవుకు పెట్టాలి. గౌరవప్రదంగా దానికి తినిపించాలి. దీనివల్ల పుణ్యఫలం లభిస్తుంది.
ప్రతిరోజు ఉదయాన్నే ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం భగవంతుడిని పూజించి హారతి తీసుకుంటే ఐశ్వర్యం పెరుగుతుంది. ఇంటిని శుభ్రం చేయడానికి ఉంచిన చీపురును బయటి నుంచి వచ్చే వారికి కనిపించని ప్రదేశంలో పెట్టాలి. అంతేకాదు చీపురును ఎప్పుడు కాళ్లతో తొక్కకూడదు. ఎందుకంటే చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. రాత్రి వంట చేసిన తర్వాత కిచెన్‌లో ఎప్పుడూ తిన్న, వండిన పాత్రలు ఉంచకూడదు. గ్యాస్ స్టవ్‌లను శుభ్రం చేయడంతోపాటు వంటగదిని క్లీన్ చేసిన తర్వాతే నిద్రపోవాలి.