Astro News: ఇంట్లోకి పావురం వస్తే శుభమా.. అశుభమా..!

Astro News: కొన్ని సంఘటనలని మత గ్రంథాలలో ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.

Update: 2022-12-09 14:30 GMT

Astro News: ఇంట్లోకి పావురం వస్తే శుభమా.. అశుభమా..!

Astro News: కొన్ని సంఘటనలని మత గ్రంథాలలో ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఇవి సంపద, గౌరవం, ఆరోగ్యం, అదృష్టం, దురదృష్టం వంటి ముఖ్యమైన సూచనలను అందిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం జంతువులు, పక్షులకు సంబంధించిన కొన్ని విషయాలు తరచుగా చర్చకి వస్తాయి. అందులో పావురం కూడా ఒకటి. ఇది శాంతికి చిహ్నంగా చెబుతారు. మత గ్రంధాలలో పావురాన్ని లక్ష్మీ దేవి భక్తుడిగా పరిగణిస్తారు. అయితే పావురం ఇంట్లోకి వస్తే శుభమా.. అశుభమా అనేది చాలా మందికి తెలియదు. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఇంట్లోకి పావురం రావడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంటి పైకప్పు-బాల్కనీలో పావురం వస్తే ఖచ్చితంగా దానికి ఆహారం ఇవ్వాలి. అంతేకాదు ప్రతిరోజూ పక్షుల కోసం ధాన్యపు గింజలు పెడితే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలు, అడ్డంకులు తొలగిపోయి జీవితంలో శుభం కలుగుతుంది. కానీ ఇంట్లో పావురం గూడు కట్టడం అశుభం.

అనేక సార్లు పావురం ఇంటి బాల్కనీ లేదా టెర్రస్ మీద గూడు పెడుతుంది. ఇలా గూడు పెట్టడం మంచిది కాదు. ఇది ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలను తెస్తుంది. వెంటనే గూడును తీసివేస్తే బాగుంటుంది. పావురం ఇంటి పైకప్పు-బాల్కనీని దాటి లోపలికి ప్రవేశిస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం. ఇది మీ జీవితంలో చాలా ఆనందం, డబ్బుని తెస్తుందని అర్థం. పావురానికి ఆహారం ఇవ్వండి. అయితే పావురాన్ని మాత్రం ఇంట్లో గూడు కట్టుకోనివ్వకూడదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News