Pooja Room Things: ఇంట్లోని పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి మీ వెంటే..!

Pooja Room Things: కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారం ఇంట్లో పూజగదిని నిర్మించాలి. లేదంటే అనర్థాలు ఏర్పడుతాయి.

Update: 2023-09-23 15:30 GMT

Pooja Room Things: ఇంట్లోని పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే లక్ష్మీదేవి మీ వెంటే..!

Pooja Room Things: కొత్తగా ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు ప్రకారం ఇంట్లో పూజగదిని నిర్మించాలి. లేదంటే అనర్థాలు ఏర్పడుతాయి. పూజ గది దిశ, దాని నిర్వహణ, ఆ గదిలో ఉండే వస్తువుల గురించి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా పాటించాలి. లేదంటే కుటుంబ సభ్యులకు కష్టాలు మొదలవుతాయి. వాస్తు నియమాలను పాటించడం వల్ల ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. ఆనందం అదృష్టం వస్తాయి. వాస్తు ప్రకారం పూజ గదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. 

ఈశాన్య దిశలో పూజగది నిర్మాణం

వాస్తు ప్రకారం ఇంట్లో పూజగదిని ఈశాన్య దిక్కులో నిర్మించాలి. దీనివల్ల ఇంట్లో సుఖశాంతులు, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. దక్షిణ దిశలో పూజగదిని ఎప్పుడు నిర్మించవద్దు. అలాగే సంపద, విజయాన్ని పొందడానికి పూజ గదిలో కొన్ని ప్రత్యేక వస్తువులు ఉంచాలి. అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతాయి.

దేవతలు చిత్రాలు

ఇంట్లో ఉండే పూజగదిలో దేవతల చిత్రాలను మాత్రమే ఉంచాలి. అలాగే దేవతల ఉగ్ర రూపాల చిత్రాలను ఎప్పుడూ ఉంచవద్దు. నార్మల్​గా ఉండే చిత్రాలను మాత్రమే ఉంచాలి.

శంఖం ఊదడం

తల్లి లక్ష్మిదేవికి శంఖం అంటే చాలా ఇష్టం. రాక్షసులు సముద్రాన్ని మథనం చేసినప్పుడు వెలువడిన వాటిలో శంఖం కూడా ఒకటి. ఇంట్లో శంఖం ఊదితే పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. అలాగే లక్ష్మి తల్లి సంతోషించి సంపదలను ప్రసాదిస్తుంది. 

గంగా జలం

హిందూ మతం ప్రకారం గంగా నది నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. పూజా గదిలో గంగానది పవిత్ర జలాన్ని ఉంచినట్లయితే విష్ణువు, తల్లి లక్ష్మి ఇద్దరి అనుగ్రహం లభిస్తుంది. దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుంది. అలాగే సుఖము, సంపద కలుగుతాయి.

Tags:    

Similar News