Amavasya: అధిక మాసం అమావాస్యతో ముగుస్తుంది.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు..!
Amavasya: ఈ సంవత్సరం అధిక మాసం వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.
Amavasya: ఈ సంవత్సరం అధిక మాసం వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇది ఆగస్ట్ 16 అమావాస్యతో ముగుస్తుంది. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. ఈ 30 రోజుల వ్యవధిలో వచ్చే అమావాస్యను అధికమాస అమావాస్య అంటారు. ఈ రోజున పొరపాటున కూడా తప్పులు చేయవద్దు. లేదంటే డబ్బు, సంపద, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ పోతాయి. అధిక మాస అమావాస్య ఎందుకు ముఖ్యమైనదో ఈరోజు తెలుసుకుందాం.
సాధారణంగా అధిక మాసంలో శుభ కార్యాలకు బదులు ప్రత్యేక ఉపవాసాలు, పుణ్యకార్యాలు చేస్తారు. అందుకే దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. అధికమాసంలో పూజ-పారాయణం, జపం-తపస్సు, దానధర్మాలు చేయడం వల్ల అనేక జన్మల పుణ్యాన్ని పొందుతారు. ఈ సంవత్సరం జూలై 18 నుంచి అధిక మాసం ప్రారంభమైంది. ఆగస్టు 16న ముగుస్తుంది. ఈ మాసంలో విష్ణువును గణేశునితో పాటుగా పూజిస్తే సర్వపాపాలు నశించి పుణ్యం లభిస్తుంది.
అధిక మాసం అమావాస్య రోజున చేసిన శుభ కార్యాల పుణ్యం జీవితాంతం లభిస్తుంది. ఇది బుధవారం వస్తుండటంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పూజగదిలో పంచామృతంతో వినాయకుని విగ్రహాన్ని శుభ్రం చేయాలి. ధూప దీపాలు వెలిగించి హారతినివ్వాలి. లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత శివుడు, పార్వతి దేవిని అభిషేకించాలి. శివలింగంపై నీటిని సమర్పించి ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి. అమావాస్య రోజు శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని కూడా పూజించాలి.
పూర్వీకులకు ధూప ధ్యానం
అమావాస్య రోజు పూర్వీకులకు ధూప ధ్యానం చేయాలి. తరువాత ఆవులు, కుక్కలు, కాకులకి ఆహారం పెట్టాలి. చీమలకు పంచదార వేయాలి. అవసరమైన వారికి ఆహారం పెట్టాలి. ధాన్యాలు, పాదరక్షలు, దుస్తులు, వీలైనంత ఎక్కువ డబ్బును దానం చేయాలి. చలికాలం వస్తుంది కాబట్టి దుప్పట్లు దానం చేయాలి. గోవుల సంరక్షణ కోసం విరాళాలు అందించాలి. విష్ణు పురాణం, శివపురాణం, రామాయణం మొదలైన పుస్తకాలను చదవాలి. దీనివల్ల అదృష్టం కలిసివస్తుంది. లక్ష్మీదేవి మీ వెంట ఉంటుంది. అష్ట ఐశ్వార్యాలని పొందుతారు.