Viral Video: ఐఐటీ క్యాంపస్‌లోకి అనుకోని అతిథి.. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ ప్రజలు
Viral Video: ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పోవాయ్ క్యాంపస్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది.

Viral Video: ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పోవాయ్ క్యాంపస్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆదివారం సాయంత్రం క్యాంపస్‌లో హఠాత్తుగా అనుకోని ఓ అతిథి ప్రవేశించింది. దీంతో అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంతకీ ఎవరా అతిథి.? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఆదివారం రాత్రి ముంబై ఐఐటీ క్యాంపస్‌లోకి భారీ మోసలి వచ్చింది. పద్మావతి ఆలయం, లేక్ సైట్ సమీపంలోని సరస్సు నుంచి మొసలి వచ్చినట్లు గుర్తించారు. రోడ్డుపై తిరుగుతున్న మొసలిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మొసలిని బంధించి సురక్షితంగా మళ్లీ సరస్సులో విడిచిపెట్టారు. ఆదివారం రాత్రి 7-8 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది. మొసలి రోడ్డుపై పాకుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ముంబై ఐఐటీ క్యాంపస్‌లో మొసలి తీరుగుతున్న వీడియోను X లో రాజ్ మహి అనే యూజర్ షేర్ చేశారు. ఈ వీడియోతోపాటు.. “ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పోవాయ్ క్యాంపస్‌లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది, రోడ్డుపై మొసలి తిరుగుతున్నట్లు కనిపించింది. లేక్ సైట్‌లోని పద్మావతి ఆలయం సమీపంలోని సరస్సు నుండి అది క్యాంపస్‌లోకి ప్రవేశించింది. రోడ్డుపై మొసలి సంచరిస్తున్న దృశ్యం చూస స్థానికులు భయాందోళన చెందారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం 7-8 గంటల మధ్య జరిగింది, పౌరులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు' అని రాసుకొచ్చాడు.
ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో రోడ్లపై మొసలి కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పోవై సరస్సు నుంచి మొసళ్లు రోడ్లపైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో వన్యప్రాణుల భద్రతపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.