Ocean's warning: సముద్రంలో ఏం జరుగుతోంది? వేల ప్రాణులు ఎందుకు చనిపోతున్నాయి?

Ocean's Warning: సముద్రతీరాలపై తిమింగలాల మృతదేహాలు బయటకి రావడం ప్రకృతి హెచ్చరికగా భావించవచ్చా?

Update: 2025-03-26 03:30 GMT
Ocean warning

Ocean warning: సముద్రంలో ఏం జరుగుతోంది? వేల ప్రాణులు ఎందుకు చనిపోతున్నాయి?

  • whatsapp icon

Ocean's Warning: ఇటీవల సముద్ర తీరం వద్ద ఒక అనూహ్యమైన, ఆందోళన కలిగించే పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో సముద్ర జంతువులు చనిపోతూ తీరానికి తేలిపోవడం శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగిస్తోంది. టాస్మానియాలో ఒక్కసారిగా 150కి పైగా ఫాల్స్ కిల్లర్ వీల్స్ (ఒక రకం తిమింగలాలు) చనిపోయి తీరం వద్ద కనిపించాయి. ఇలాంటి సంఘటనలు వరుసగా ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతున్నాయి. వీటికి కారణాలు ఇంకా పూర్తిగా స్పష్టంగా లేవు. కానీ శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టారు. వాటిలో వాతావరణ మార్పులు ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం, ప్రవాహ మార్పులు, జీవ నివాసాల విధ్వంసం వల్ల తిమింగలాలు దారి తప్పి తీరానికి వచ్చే అవకాశముంది.

మరొక కారణం..శబ్ద కాలుష్యం. సముద్రంలో నావికాదళాలు ఉపయోగించే సోనార్ లాంటి శబ్ద తరంగాలు తిమింగలాల నావిగేషన్‌ను గందరగోళానికి గురిచేస్తున్నాయన్న అనుమానం కూడా ఉంది. ఇవి చీకటి లోతుల్లో స్వచ్ఛమైన శబ్దాలను ఆధారంగా చేసుకునే జీవులకు అర్థం కాని మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇదే సమయంలో, లోతైన సముద్రాల్లో ఉండే అరుదైన జీవులు తీరానికి రావడం, అలాగే మౌనంగా ఉండే ఓర్ఫిష్ లాంటి చేపలు కూడా కనిపించడమే మానవాళిలో భయాందోళనలు పెంచుతోంది.

కొన్ని సోషల్‌మీడియాలో ఈ దృశ్యాలను భవిష్యత్తు విపత్తుల సంకేతాలుగా భావిస్తున్నారు. ఈ ప్రాణుల మరణాల వెనుక ఏం జరుగుతోందో శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నారు. కానీ ఈ సంఘటనలు కేవలం సహజంగా జరుగుతున్నాయా? లేకపోతే ప్రకృతి మనకు ముందస్తుగా చెప్పే హెచ్చరికలేనా అన్న ప్రశ్న మాత్రం ఇంకా గుసగుసలాడుతూనే ఉంది. తీరాలపై తిమింగలాల మృతదేహాలు, లోతుల నుంచి వస్తున్న జీవులు... ప్రకృతి ఏదో తెలియజేస్తుందా అన్న అనుమానం పెరుగుతోంది.

Tags:    

Similar News