Indian Railways: కిటికీలు, తలుపులు లేని స్పెషల్ రైలును చూశారా.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారంతే..!

Indian Railway News: మీరెప్పుడైనా బోగీకి కిటికీలు లేదా తలుపులు లేని ట్రైన్‌ను చూశారా. బహుశా ఇలాంటి బోగీ రైలును మీరు చూసి ఉండరు. కిటికీలు, తలుపులు లేని రైలు కూడా రైల్వే ద్వారా నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Update: 2023-07-14 11:56 GMT

Indian Railways: కిటికీలు, తలుపులు లేని స్పెషల్ రైలును చూశారా.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారంతే..

Indian Railways: మనమందరం రైలులో ప్రయాణిస్తుంటాం. సాధారణంగా మన ప్రయాణించే రైలులో కిటీకీలు, డోర్లు ఉంటాయి. అయితే, మీరెప్పుడైనా బోగీకి కిటికీలు లేదా తలుపులు లేని ట్రైన్‌ను చూశారా. బహుశా ఇలాంటి బోగీ రైలును మీరు చూసి ఉండరు. కిటికీలు, తలుపులు లేని రైలు కూడా రైల్వే ద్వారా నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కోచ్‌లకు కిటికీలు, తలుపులు లేకుండానే..

కిటికీలు, తలుపులు లేని రైళ్లను NMG కోచ్‌లతో కూడిన రైళ్లు అంటారు. మనం ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లలోని బోగీలన్నీ రిటైర్ అయిపోతాయని మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏదైనా రైలు బోగీల జీవితకాలం 25 సంవత్సరాలు మాత్రమే. దానిని మరమ్మత్తు చేయడం ద్వారా 5 నుంచి 10 సంవత్సరాల వరకు పొడిగిస్తుంటారు.

కోచ్ వయస్సు 25 సంవత్సరాలు..

ఏదైనా కోచ్ 25 సంవత్సరాలు పూర్తయ్యాక, ఆ తర్వాత ICF కోచ్‌ను ప్యాసింజర్ రైలు సర్వీస్ నుంచి తొలగిస్తారు. తరువాత ఇది NMG రేక్ పేరుతో ఆటో క్యారియర్‌గా ఉపయోగిస్తుంటారు. NMG అంటే కొత్తగా సవరించిన గూడ్స్ వ్యాగన్ అన్నమాట.

అలాంటి కోచ్ వల్ల ఉపయోగం ఏమిటి?

NMG వ్యాగన్ అన్ని కిటికీలు, తలుపులు మూసివేస్తారు. సీల్ చేసిన తర్వాత కార్లు, మినీ ట్రక్కులు, ట్రాక్టర్లలను సులభంగా లోడ్, అన్‌లోడ్ చేసుకునే విధంగా ఈ వ్యాగన్‌లను సిద్ధం చేస్తారు.

సీట్లు, ఫ్యాన్లు, లైట్లు కూడా తీసేస్తారు..

సాధారణ కోచ్‌ను NMG కోచ్‌గా మార్చడానికి, సీట్లు, ఫ్యాన్లు, లైట్లు అన్నీ తీసివేస్తాంటారు. అంతే కాకుండా మరింత దృఢంగా ఉండేందుకు ఇనుముతో వెల్డిండ్ చేస్తారు. కోచ్ వెనుక భాగంలో ఒక డోర్ అమర్చుతారు. దానిని తెరవడం ద్వారా లగేజీని అందులో ఉంచుతారు.

Tags:    

Similar News