పేరుకే ఎక్స్‌ప్రెస్.. నత్త కంటే వెనకే.. ప్రపంచంలోనే అత్యంత స్లో ట్రైయిన్ ఇదే.. ప్రతిరోజూ ఫుల్ రష్.. ఎందుకో తెలుసా?

World Slowest Train: భారతదేశంలో ప్రతిరోజూ కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేలాది రైళ్లు ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.

Update: 2024-09-25 06:45 GMT

పేరుకే ఎక్స్‌ప్రెస్.. నత్త కంటే వెనకే.. ప్రపంచంలోనే అత్యంత స్లో ట్రైయిన్ ఇదే.. ప్రతిరోజూ ఫుల్ రష్.. ఎందుకో తెలుసా?

World Slowest Train: భారతదేశంలో ప్రతిరోజూ కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేలాది రైళ్లు ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. కొన్ని రైళ్లు గాలితో పోటీపడి దూసుకపోతుంటాయి. మరికొన్ని చాలా నెమ్మదిగా కదులుతూ ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతుంటాయి. కొన్ని కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి కూడా రోజులు తీసుకుంటుంటాయి. ఇక భారతదేశం గురించి మాట్లాడితే, ఢిల్లీ నుంచి భోపాల్ మార్గంలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచింది. దీని వేగం గంటకు 160 కి.మీ.లు వెళ్తుంది. ఊటీ-నీలగిరి మధ్య అత్యంత నెమ్మదైన రైలు నడుస్తోంది. కానీ, ఈరోజు చర్చ భారతదేశం గురించి కాదు, ప్రపంచంలోనే అత్యంత స్లో ట్రైన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు 290 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి 10 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అంటే ఆటోలో కూడా ఇంత దూరం వెళ్తే రైలు కంటే ముందే చేరుకుంటారన్నమాట.

గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడుస్తున్న రైలు. ఈ రైలు పేరులో ఎక్స్‌ప్రెస్ ఉండవచ్చు. కానీ, దీని వేగం తాబేలులా ఉంటుంది. గంటకు కేవలం 29 కి.మీ వేగంతో నడిచే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలుగా పేరు పొందింది.

గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్ స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్, సెయింట్ మోరిట్జ్ స్టేషన్‌లను కలుపుతుంది. ఈ రైలు 1930 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ రైలు వేగం తక్కువగా ఉండవచ్చు. కానీ, దీని మార్గం చాలా అందంగా ఉంటుంది. ఈ రైలు 290 కి.మీ మార్గంలో 90కి పైగా సొరంగాలు, 300 వంతెనలను దాటుతుంది.

ఈ రైలు ప్రయాణంలో మంచు పర్వతాలు, అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. రైలు పర్వతాలు, కొండల గుండా వెళుతుంది. కొందరికి ఈ దృశ్యాలు ఎంతో అందంగా కనిపిస్తే.. మరికొందరికి భయంగా అనిపిస్తుంటాయి. ప్రయాణంలో చాలా మందికి వాంతులు, ఆరోగ్య సమస్యలు రాకుండా చూసేందుకు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రజలకు ప్రత్యేకమైన వైన్‌ను అందజేస్తున్నారు. ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు ఈ రైలులో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

Tags:    

Similar News