Banana Leaf Results: అరటి ఆకులో దేవుళ్లకు నైవేద్యం ఎందుకు పెడుతారో తెలుసా..!

Banana Leaf Results: ఆలయాల్లో దేవుడికి పూజ చేసే సమయంలో లేదా ఎక్కడైనా శుభకార్యా లు చేస్తున్నప్పుడు అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తారు.

Update: 2024-05-08 02:30 GMT
Do You Know Why Offerings To Gods Are Made In Banana Leaves The Results Are Like This

Banana Leaf Results: అరటి ఆకులో దేవుళ్లకు నైవేద్యం ఎందుకు పెడుతారో తెలుసా..!

  • whatsapp icon

Banana Leaf Results: ఆలయాల్లో దేవుడికి పూజ చేసే సమయంలో లేదా ఎక్కడైనా శుభకార్యా లు చేస్తున్నప్పుడు అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తారు. సనాతన హిందూ సంప్రదాయం, జ్యోతిష్యం ప్రకారం ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. దేవుడికి పూజ చేసిన అనంతరం నైవేద్యం సమర్పిస్తేనే అ పూజ పూర్తియినట్లు అర్థం. ఆ పూజ ఫలం మీకు దక్కుతుంది. అరటి ఆకులపై నైవేద్యాలు పెట్టడం వల్ల దేవుళ్లు సంతోషించి వరాలను కురిపిస్తారని నమ్మకం. అరటి ఆకులను ఇంట్లో వాడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పెద్దలు చెబుతారు. ఈ రోజు అరటి ఆకులను పూజలో ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

శాస్త్రాల ప్రకారం అరటి మొక్కలో శ్రీ మహావిష్ణువు, తల్లి లక్ష్మి నివసిస్తారు. అందువల్ల అరటి ఆకులపై విష్ణువుకు ఆహారాన్ని సమర్పించడం ద్వారా అతడు ప్రసన్నుడవుతాడు. అతడి ఆశీర్వాదాలు లభిస్తాయి. పూజలో అరటి ఆకులను ఉపయోగించడం వల్ల విష్ణువు, తల్లి లక్ష్మి ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. మహావిష్ణువుకు అరటి ఆకులను నైవేద్యంగా పెట్టడం వల్ల వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.

అరటి ఆకుపై వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. శాస్త్రాల ప్రకారం వినాయకుడికి అరటిపండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే అరటి ఆకులో నైవేద్యం సమర్పిస్తే అతని జీవితంలో కష్టాలు తొలగిపోతాయి అతను బుధ దోషం నుంచి విముక్తి పొందుతాడని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అరటి ఆకుపై లక్ష్మీదేవికి నైవేద్యాన్ని సమర్పిస్తే ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా ఉపశమనం పొందుతాడు. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి ఆకులపై లక్ష్మీదేవికి నైవేద్యాలు సమర్పించాలని పెద్దలు చెబుతారు. ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోడు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతాడు.

Tags:    

Similar News