Medicine Strip: మందులపై ఎరుపు రంగు గీతలు ఎందుకుంటాయి? Rx, NRx, XRxల అర్థమేంటో తెలుసా?
Medicine Strip: వైద్యులు మనకు మందులు రాసిచ్చినప్పుడల్లా మెడికల్ స్టోర్‌కి వెళ్లి అవసరాన్ని బట్టి ఎక్కువగా లేదా తక్కువగా తీసుకుంటుంటాం.
Medicine Strip: వైద్యులు మనకు మందులు రాసిచ్చినప్పుడల్లా మెడికల్ స్టోర్‌కి వెళ్లి అవసరాన్ని బట్టి ఎక్కువగా లేదా తక్కువగా తీసుకుంటుంటాం. కొన్ని సార్లు సొంత నిర్ణయంతో మనం చిన్న చిన్న నొప్పులకు లేదా వ్యాధులకు టాబ్లెట్లు తీసుకుంటుంటాం. అయితే, చిన్న పొరపాటు వల్ల మనం బాధపడాల్సి వస్తుంది. మందులు కొన్న తర్వాత కొన్ని ఔషధాలపై ఎరుపు గీతలు లేదా చారలు ఉన్నట్లు మీరు ఎప్పుడైనా గమనించారా? దీనికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్వంత నిర్ణయాలు వద్దు..
ప్రస్తుతం ప్రజలు శరీరంలో చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే గూగుల్‌లో శోధించి లేదా ఎవరైనా సలహా మేరకు మందులు లేదా యాంటీబయాటిక్‌లను కొనుగోలు చేస్తుంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకునే మందులు కొన్నిసార్లు హాని కలిగించే అవకాశం ఉంది. వైద్యుని సలహా లేకుండా ఎప్పుడూ ఎలాంటి మందులు తీసుకోవద్దు. ఎందుకంటే మందులకు సంబంధించిన అనేక విషయాలు వైద్యులకు మాత్రమే అర్థమవుతాయి.
చారల అర్థం ఏంటంటే..
దీని కోసం కొన్ని ఔషధ కంపెనీలు మందుల ప్యాకెట్లపై ప్రత్యేక గుర్తులు వేస్తాయి. అందుకే వైద్యుల సలహా లేకుండా అలాంటి మందును ఎవరూ వినియోగించలేరు.
కొన్ని మందులపై Rx అని రాసి ఉంటుంది. వైద్యుల సలహాతో మాత్రమే ఆ మందును తీసుకోవాల్సి ఉంటుంది.
ఔషధంపై NRx రాసి ఉండడం వల్ల డ్రగ్ లైసెన్స్ ఉన్న వైద్యులు మాత్రమే ఆ ఔషధం తీసుకోవాలనే సలహా ఇవ్వగలరు.
XRx కొన్ని మందులపై రాసి ఉంటుంది. అంటే డాక్టర్ మాత్రమే ఆ మందును రోగికి ఇవ్వగలడు. అది ఏ మెడికల్ స్టోర్ నుంచి కొనుగోలు చేయలేరు. మీ దగ్గర డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా దీనిని కొనుగోలు చేయగలరు.