Dangerous Planets: ఓ పక్క అగ్ని పర్వతాలు, మరో పక్క నిరంతర వర్షాలు.. మన విశ్వంలో ఈ గ్రహాలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

ఈ గ్రహాన్ని "గొజ్జల్" అని పిలుస్తుంటారు. ఈ గ్రహం చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఇనుము కూడా కరుగుతుంది. దాని ఉపరితలంపై లావా సముద్రాలు ఉన్నాయి. బలమైన గాలులు నిరంతరం వీస్తాయి.

Update: 2024-08-25 11:45 GMT

Dangerous Planets: ఓ పక్క అగ్ని పర్వతాలు, మరో పక్క నిరంతర వర్షాలు.. మన విశ్వంలో ఈ గ్రహాలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Science News: విశ్వంలో చాలా గ్రహాలున్నాయి. వాటిలో కొన్ని చాలా అందంగా, నివాసయోగ్యంగా ఉంటాయి. కొన్ని చాలా ప్రమాదకరమైనవి. కొన్ని గ్రహాలపై నిరంతరాయంగా వర్షాలు కురుస్తుంటే కొన్ని గ్రహాలపై అగ్ని సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఈ ప్రమాదకరమైన గ్రహాలపై జీవితాన్ని ఊహించడం కష్టం. అలాంటి కొన్ని గ్రహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ గ్రహాన్ని "గొజ్జల్" అని పిలుస్తుంటారు. ఈ గ్రహం చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ ఇనుము కూడా కరుగుతుంది. దాని ఉపరితలంపై లావా సముద్రాలు ఉన్నాయి. బలమైన గాలులు నిరంతరం వీస్తాయి.

ఈ గ్రహం దాని నక్షత్రానికి చాలా దగ్గరగా ఉంది. దాని ఉపరితల ఉష్ణోగ్రత 2,200 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. ఈ వేడి కారణంగా ఈ గ్రహం వాతావరణం నిరంతరం వేడిగా ఉంటుంది.

అలాగే కొన్ని గ్రహాల మీద నిరంతరం వర్షాలు కురుస్తాయి. వీటి వాతావరణం సిలికా కణాలను కలిగి ఉంటుంది. అవి చాలా వేడిగా ఉంటాయి. అవి కరిగి వర్షంలా కురుస్తుంటాయి.

మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతి కూడా చాలా ప్రమాదకరమైనది. దాని వాతావరణంలోని తుఫానులు చాలా శక్తివంతమైనవి. అవి భూమిపై అతిపెద్ద తుఫానుల కంటే వేల రెట్లు పెద్దవి.

శని గ్రహం వలయాలు చాలా అందంగా కనిపిస్తాయి. కానీ, దాని వాతావరణంలో అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విష వాయువులు ఉంటాయి.

కొన్ని గ్రహాల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎవరూ జీవించలేరు. అనేక గ్రహాల వాతావరణంలో విషపూరిత వాయువులు ఉంటాయి. ఇవి శ్వాస తీసుకోవడంలో ప్రాణాంతకం.

కొన్ని గ్రహాలపై బలమైన గాలులు వీస్తాయి. ఇవి ఏదైనా వస్తువును ఎగిరిపోయేలా చేస్తుంటాయి. కొన్ని గ్రహాలపై రేడియేషన్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఏ జీవిని అయినా నాశనం చేస్తుంటాయి.

Tags:    

Similar News