IRCTC Tour: ఊటీ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. రూ. 10వేలలోపే ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. 6 రోజుల ప్లాన్‌లో ఏమున్నాయంటే?
IRCTC Tour Package: ఈ టూర్ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి దీని ప్రయాణం ప్రారంభం కానుంది. ప్రయాణికులు స్లీపర్, థర్డ్ ఏసీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
IRCTC Tour Package: మీరు ప్రయాణాలను ఇష్టపడతారా.. అయితే, అందమైన లోయలను సందర్శించాలని అనుకుంటే.. మీకోసం IRCTC ఎంతో అద్భుతమైన, తక్కువ ధరలో ప్యాకేజీని ప్రవేశపెట్టింది. దీని కింద చాలా తక్కువ ధరలో ఊటీకి వెళ్లి సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్యాకేజీలో మీరు కూనూర్‌ను కూడా సందర్శించవచ్చు. ఈ ప్రయాణాన్ని ఐఆర్‌సీటీసీ ఐదు రాత్రులు, ఆరు పగళ్లతో పరిచయం చేసింది.
ఈ టూర్ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి దీని ప్రయాణం ప్రారంభం కానుంది. ప్రయాణికులు స్లీపర్, థర్డ్ ఏసీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ రూ.9410 నుంచి ప్రారంభమై రూ.26 వేల వరకు ఉంటుంది. ప్రయాణ సమయంలో రైల్వేశాఖ ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది.
అందుబాటులో సౌకర్యాలు..
ప్రయాణికులు బస చేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా హోటల్, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం అందిస్తారు. దీంతో పాటు వాహనాన్ని స్టేషన్‌కు తీసుకెళ్లి వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు. అయితే, మీరు ప్రయాణంలో ఏదైనా అదనపు వస్తువును కొనుగోలు చేసినా లేదా మరేదైనా సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నా, లేదా మరో ప్రాంతాన్ని సందర్శించాలనుకున్నా.. ఈ ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది.
ఎంత ఖర్చు అవుతుందంటే?
మీరు రెండు కేటగిరీలలో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీరు ఒక్క బుకింగ్ చేస్తే, ఈ టూర్ ప్యాకేజీ కోసం మీరు థర్డ్ ఏసీలో రూ. 26,090లు కట్టాల్సి వస్తుంది. అలాగే స్లీపర్‌లో ప్రయాణించాలనుకుంటే రూ. 24,760 చెల్లించాలి. అదేవిధంగా డబుల్ బుకింగ్‌పై థర్డ్ ఏసీకి రూ.14,120, స్లీపర్‌కు రూ.12780గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్‌లో, థర్డ్ ఏసీలో రూ.11,120, స్లీపర్‌లో రూ.9780లు నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు థర్డ్ ఏసీలో బెడ్‌తో కూడిన ధర రూ.7,250లుగా నిర్ణయించారు. స్లీపర్‌లో రూ.5,920లు పేర్కొన్నారు. ఇది కాకుండా థర్డ్ ఏసీలో బెడ్ లేని ధర రూ.6,640లు కాగా, స్లీపర్‌లో రూ.5,300లుగా పేర్కొన్నారు.