Viral Video: పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే.. సోషల్‌ మీడియాలో ఫస్ట్‌నైట్ వీడియో.. !

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా పిచ్చి పీక్స్‌కి చేరింది. లైక్స్‌ కోసం ఫాలోవర్లను పెంచుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు.

Update: 2024-07-09 12:30 GMT

Viral: పిచ్చి పీక్స్‌కి చేరడం అంటే ఇదే.. సోషల్‌ మీడియాలో ఫస్ట్‌నైట్ వీడియో.. !

Viral: ప్రస్తుతం సోషల్ మీడియా పిచ్చి పీక్స్‌కి చేరింది. లైక్స్‌ కోసం ఫాలోవర్లను పెంచుకోవడానికి ఎంతకైనా దిగజారుతున్నారు. కొందరు ప్రాణాలను పనంగా పెడుతుంటూ మరికొందరు మాత్రం ఆత్మగౌరవాన్ని, సిగ్గును కూడా వదిలేస్తున్నారు. ఎలాగైనా పాపులర్‌ అవ్వాలని వ్యక్తిగత జీవితాలను కూడా బజార్లో పెట్టేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఓ కొత్త జంట ఏకంగా తమ మొదటి రాత్రి వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టేసింది.

కొత్తగా పెళ్లైన ఓ జంటకు శోభనం ఏర్పాటు చేశారు. గదిని పూలతో అలంకరించారు. అయితే నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఈ కార్యాన్ని కాస్త మనోడు అత్యుత్సాహంతో సోషల్‌ మీడియాలో పెట్టేశాడు. తన భార్యతో కలిసి ఫస్టనైట్ రోజు కూడా వ్లాగ్‌ను పోస్ట్ చేశాడు. పూలతో అలంకరించిన మంచాన్ని వీడియోలో చూపిస్తూ, తన భార్యను పిలిచి మరీ నెటిజన్లతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ వీడియోలో సదరు వ్యక్తి మాట్లాడుతూ.. 'హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు మా ఫస్ట్ నైట్ జరగబోతోంది.. మంచాన్ని సువాసన వెదజల్లే పూలతో ఎంతో అందంగా అలంకరించారు' అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా తన భార్యతో సైతం వీడియోలో మాట్లాడించాడు. దీంతో సదరు మహిళ కూడా నవ్వుతూ వీడియోలో మాట్లాడింది. దీనతంటినీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త తెగ వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. వ్యక్తిగత జీవితాలను ఇలా అందరికీ చెప్పడంలో ఏంటని విరుచుకుపడుతున్నారు. ఇక మరికొందరైతే పిచ్చి పీక్స్‌కి చేరిందని కామెంట్స్‌ చేస్తున్నారు. 


Tags:    

Similar News