Video: గవర్నర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. హెలికాఫ్టర్ టేకాఫ్ అయిన వెంటనే దాంట్లో నుంచి పొగలు

Video: రాజస్థాన్ గవర్నర్ కు పెను ప్రమాదం తప్పింది. గవర్నర్ హరిభావు బాగ్డే ప్రయాణిస్తున్నప్పుడు హెలికాప్టర్ నుంచి పొగలు వచ్చాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హెలికాఫ్టర్ టెకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో నుంచి వచ్చాయి. అయితే వెంటనే అధికారులు హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
పాలి పర్యటనలో ఉన్న గవర్నర్ పాలి నుంచి జైపూర్ కు వెళ్తున్నారు. హెలికాఫ్టర్ టెకాఫ్ అయిన కొద్దిసేపటికే పొగలు వచ్చాయి. అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. పొగకు కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెలికాప్టర్ నిర్వహణలో ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా అనేది పరిశీలిస్తారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటారో కూడా అధికారులు నిర్ధారిస్తారు.
హరిభావు కిషన్‌రావ్ బాగ్డే ప్రస్తుత రాజస్థాన్ గవర్నర్. ఆయనకు గతంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లతో సంబంధం ఉంది. ఆయన 1945 ఆగస్టు 17న అప్పటి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జన్మించారు. ఆయన చిన్న వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. తరువాత ఆయన 1985లో ఔరంగాబాద్ తూర్పు స్థానం నుండి మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన ఫులంబ్రి అసెంబ్లీ స్థానం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.