Supreme court: హేమంత్ సోరెన్‌కు బెయిల్ నిరాకరణ
Supreme court: ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme court: సుప్రీంకోర్టులో EDకు చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. భూ కుంభకోణం కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఐతే ఈ కేసులో సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్‌ను నిరాకరిస్తూ.,, ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులు చట్టవిరుద్ధం అని పేర్కొంది. ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం న్యాయస్థానం.. జార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. బెయిల్‌పై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.