Corona Double Mutation: కరోనా డబుల్ మ్యూటేషన్‌లో మళ్లీ కొత్త వేరియేషన్

Corona Double Mutation: భారత్ సహా 17దేశాలకు వ్యాపించిన కరోనా డబుల్ మ్యుటేషన్ రకం B.1.617 దాని రూపాన్ని మార్చుకుంది.

Update: 2021-05-09 07:54 GMT

కరోనా డబల్ ముటాంట్ (ఫైల్ ఇమేజ్)

Corona Double Mutation: ప్రపంచ దేశాలను ఇప్పటికే కరోనా వణికిస్తోంది. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ మానవ జాతిని బెంబేలెత్తిస్తోంది. భారతదేశంతో సహా ప్రపంచంలోని 17 దేశాలకు వ్యాపించిన కరోనా డబుల్ మ్యుటేషన్ రకం B.1.617 దాని రూపాన్ని మళ్లీ మార్చింది. ఇది మునుపటి కంటే చాలా డేంజర్‌గా మారిందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భారతదేశం, బ్రిటన్, స్పెయిన్లలో ఈ రకం ఫార్మాట్‌లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. కొత్త రకం బి.1.617.2. వేరియెంట్‌లో కొన్ని కొత్త మార్పులు గుర్తించారని వాటికోసం వైద్య నిపుణులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు.

రెండు ప్రధాన ఉత్పరివర్తనలు L452R, E484Q 617 లో నమోదు చేయబడ్డాయన్నారు. కానీ ఇప్పుడు E484Q దాని నుంచి కనుమరుగైందని పేర్కొన్నారు. అయితే ఇతర మార్పులను అర్థం చేసుకోవడానికి అధ్యయనాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ రకం వైరస్ బలపడడం వల్లే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. సిసిఎంబిలో జీనోమ్ సీక్వెన్సింగ్‌లో కొత్త తరహా కేసులు దొరికాయని తెలిపారు. వాటిని లోతుగా అధ్యయనం చేస్తున్నారన్నారు.

డబుల్ మ్యుటేషన్ వేరియంట్ కొత్త వెర్షన్‌ను పున రూపకల్పన చేస్తూ బ్రిటన్ దీనిని VUI-21APR-02 గా గుర్తించిందని, అయితే భారతదేశంలో దీనిని B.1.617.2 గా సూచిస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్ వేగంగా మారుతోందని, ప్రపంచంలో ఇప్పటివరకు వందలాది మార్పులు నమోదయ్యాయని తెలిపారు. ప్రతి నెలా వైరస్‌లో రెండు మార్పులు సంభవిస్తున్నాయన్నారు. అయితే ఈ మార్పులలో కొన్ని చాలా ప్రాణాంతకమైనవని రాకేశ్ మిశ్రా ఈ సందర్భంగా గుర్తుచేశారు.

డబుల్ మ్యూటెంట్ అంటే...

ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాప్తి చెందుతున్న దశలో వైరస్‌ అనేక మార్పులకు లోనవుతుంది. దీనినే మ్యూటేషన్‌ అంటారు. ఈ మ్యూటేషన్‌ సందర్భంగా ఈ వైరస్‌లో పెద్దగా మార్పులు ఉండవు. తమ ప్రవర్తనను కూడా మార్చుకోవు. అయితే కొన్ని మ్యూటేషన్స్‌ సందర్భంగా స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు జరిగి మానవ శరీరంలోని ఇతర కణాలలోకి కూడా ప్రవేశిస్తాయి. ఇలాంటి వైరస్‌లు మరింత ప్రమాదకరంగా, త్వరగా వ్యాప్తి చెందే లక్షణాలను కలిగి ఉంటాయి. పైగా చాలాసార్లు ఇవి వ్యాక్సీన్‌లకు కూడా లొంగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Tags:    

Similar News