TIFR: ఒకేసారి ముగ్గురిపై ఎటాక్ చేస్తోన్న కొత్త వేరియంట్

TIFR: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు 3లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

Update: 2021-05-05 08:15 GMT

కరోనా(ఫైల్ ఇమేజ్ )

TIFR: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు 3లక్షలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొదటి దశ కంటే రెండో దశ వైరస్ రెండున్నర రెట్లు అధిక ప్రభావవంతమైనదని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఒకరి నుంచి ఒకేసారి ముగ్గురికి వైరస్ వ్యాపిస్తోందని పరిశోధనలో తేలింది. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిర్వహించిన పరిశోధన గణాంకాలుఈ విషయాలను పేర్కొంటున్నాయి. కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమో పెరుగుతున్న కేసులు, మరణాలే నిదర్శమని TIFR పేర్కొంది.

Tags:    

Similar News