Chennai: చెన్నైలో కుండపోత వర్షం.. రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
Chennai - Heavy Rains: *రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు *ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశం
Chennai - Heavy Rains: చెన్నైలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలకు సబ్‌వేలు నీటమునిగాయి. దీంతో అధికారులు సబ్‌వేలను మూసివేసినట్లు తెలుస్తోంది. అటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు వరద సహాయక చర్యలకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు. చెన్నై, చెంగల్పట్టు జిల్లాలతోపాటు తిరువళ్లూరు జిల్లాలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. దంచికొడుతున్న వానలకు రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి. కాగా.. ఎడతెరిపి లేకుండా పడుతున్న కుండపోత వానలకు పలు జిల్లాలు వణికిపోతున్నాయి.
రాత్రి నుంచి చెన్నైలో జోరు వానలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి.