Rahul Gandhi Marriage: పెళ్లెప్పుడు చేసుకుంటావ్ రాహుల్.. 20-30 ఏళ్లుగా ఈ ఒత్తిడి భరిస్తున్నా
Rahul Gandhi Marriage: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాశ్మీరీ బాలికలతో రాహుల్ గాంధీ మాట్లాడిన సందర్భంగా.. తాను పెళ్లి చేసుకునే ఆలోచనలో లేనని చెప్పారు. ఒకవేళా చేసుకున్నా పర్వాలేదని చెప్పారు. అంతేకాదు తాను 20 -30 ఏండ్లుగా ఈ ఒత్తిడిని అధిగమిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
Rahul Gandhi Marriage: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి మరోసారి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. పెళ్లెప్పుడు చేసుకుంటారంటూ కాశ్మీరీ యువతులు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. గత 20 -30 ఏండ్లుగా ఈ ఒత్తిడిని అధిగమిస్తున్నాయని చెప్పుకొచ్చారు రాహుల్.
రాహుల్ గాంధీ గత వారం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో కశ్మీరీ బాలికలతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. కశ్మీరీ బాలికల బృందంతో తాను మాట్లాడిన వీడియోను సోమవారం తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. కశ్మీరీ అమ్మాయిలు రాహుల్ గాంధీని పెళ్లి ప్లాన్స్ గురించి అడిగినప్పుడు, రాహుల్ గాంధీ నేను పెళ్లికి ప్లాన్ చేస్తున్నాను, అయితే అది జరిగితే సరే...జరగకున్నా ఒకే అని చిరునవ్వు చిందిస్తూ చెప్పడం గమనార్హం. పెళ్లి చేసుకోవడంపై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుందంటూ రాహుల్ గాంధీ బాలికలను ప్రశ్నించిన సమయంలో ఆ బాలికలను రాహుల్ తన పెళ్లి గురించి ప్రశ్నలు అడిగారు.
కాగా పెళ్లి గురించి ఎలాంటి ప్లాన్ చేస్తున్నారని బాలికలు అడగగా...ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని సమాధానం ఇచ్చారు. ఒకవేళ సమయం వస్తే చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు. రాహుల్ సమాధానికి బాలికలు...అయితే మీ పెళ్లికి మమ్మల్నీ ఆహ్వానించండి అంటూ కోరారు. తప్పకుండా పిలుస్తానంటూ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇక ప్రధాని మోదీ గురించి అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రధానితో నా సమస్య ఏమిటంటే.. ఎవరి మాట వినడు. నేను మొదటి నుండి సరైనవని భావించే ఎవరితోనైనా నాకు సమస్య ఉంది. ఎవరైనా తప్పుగా చూపినప్పటికీ, వారు దానిని అంగీకరించరు. ఈ రకమైన వ్యక్తి ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్యను సృష్టిస్తారు అంటూ వ్యాఖ్యానించారు.