Chhattisgarh Encounter:ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతి

Chhattisgarh Encounter:మావోయిస్టు పార్టీ తొలితరం నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఓరుగల్లు విప్లవ వీరుడు మాచర్ల ఏసోబు మరణించాడు. ఛత్తీస్ గడ్ ప్రజలకు జగన్ గా, రణదేవ్ దాదాగా సుపరిచితమైన దాదా దంతెవాడ, బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. ఆయన 50ఏండ్ల ఉద్యమ ప్రస్థానానికి తెరపడింది.

Update: 2024-09-05 02:52 GMT

Chhattisgarh Encounter:ఛత్తీస్‌గడ్‌ ఎన్‌కౌంటర్‌లో మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ మృతి

Chhattisgarh Encounter:మావోయిస్టు పార్టీ తొలితరం నేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఓరుగల్లు విప్లవ వీరుడు మాచర్ల ఏసోబు మరణించాడు. ఛత్తీస్ గడ్ ప్రజలకు జగన్ గా, రణదేవ్ దాదాగా సుపరిచితమైన దాదా దంతెవాడ, బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారు. ఆయన 50ఏండ్ల ఉద్యమ ప్రస్థానానికి తెరపడింది. ఆయన స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ కాజీపేట మండలం టేకుల గూడెం. ఆయన మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉద్యమాల పురిటి గడ్డగా పేరున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతో మందికి విప్లవ పాఠాలు నేర్పని జగన్ అస్తమించడాన్న వార్త పలు ప్రజా సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.

టేకులగూడెం గ్రామానికి చెందిన మాచర్ల ఏసోబు చిన్నప్పటి నుంచే విప్లవ భావాలతో పెరిగారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు. స్థానికంగా 8వ తరగతి వరకు చదువుకుని 1974లో మావోయిస్టు పార్టీలో చేరారు. 1978లో రైతు కూలి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రైతు కూలి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఆ తర్వాత 1985లో అజ్నాంతంలోకి వెళ్లారు. ఆ తర్వాత ఎంతోమందికి ఉద్యమ పాఠాలు నేర్పించాడు. ఆ తర్వాత ఓరుగల్లలో పలు స్థాయిల్లో పనిచేశారు.

మొదట అన్నసాగర్ దళకమాండర్ గా , చేర్యాల, స్టేషన్ ఘన్ పూర్ దళ కమాండర్ గా ని చేశారు. లో పట్టుదల, ఉద్యమ పటిమను గుర్తించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆ తరువాత కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయనకు ఛాన్స్ ఇచ్చింది. మావోయిస్టు పార్టీ సెక్రటరీ గణపతికి స్పెషల్ ప్రొటెక్షన్ వింగ్ కమాండ్ బాధ్యతలను అప్పగించింది.

ఆ తరువాత పార్టీ కేంద్ర మిలిటరీ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తరువాత మహారాష్ట్ర–ఛత్తీస్ గడ్ బార్డర్ ఇన్ఛార్జ్ గా, ఛత్తీస్ గడ్ మిలిటరీ కమిటీ ఇన్ఛార్జ్ గా పార్టీ నియమితులయ్యారు. దళాన్ని పటిష్టం చేయడంతోపాటు పలు పోరాటాల్లో ముందుండి నడిపించారు. దీంతో జగన్ గా రణదేవ్ దాదాగా ఉద్యమంలో కీలకంగా వ్యవహారించారు. మావోయిస్టు పార్టీలో 1974 నుంచి 2024 వరకు పని చేశారు.ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో జగన్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన 50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి తెర పడినట్లు అయ్యింది. నేడు ఆయన స్వగ్రామం టేకుల గూడెంలో అంత్యక్రియలు జరగనున్నాయి.


Tags:    

Similar News