Govt Notice to Twitter: ట్విట్టర్‌కి లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం
Govt Notice to Twitter: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఐటీ రూల్స్ తెచ్చిన సంగతి తెలిసిందే.
Govt Notice to Twitter: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఐటీ రూల్స్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియా సంస్థలు తప్పక ఆ రూల్స్ పాటించాల్సిందేనని కేంద్ర చెప్పడం, వాటిపై ట్విట్టర్ ఢిల్లీ హైకోర్టుకు పోవడం సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ట్విట్టర్‌కు కేంద్రం లాస్ట్ వార్నింగ్ అంటూ నేడు నోటీసులు పంపింది. దీంతో మరోసారి వీటి మధ్య వివాదం రేగింది.
కాగా, ఇంతవరకు భారత్‌లో అధికారులను ట్విట్టర్ నియమించకపోవడంతో కేంద్ర సీరియస్ అయింది. తక్షణమే అధికారులను నియమించాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. డిజిటల్ మీడియాలో కంటెంట్ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ రూల్స్‌ను తీసుకొచ్చింది. వీటి కోసం సోషల్‌మీడియా సంస్థలకు ఇచ్చిన 3నెలల గడువు ముగిసింది. మే 26 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల మేరకు చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా.. ట్విటర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ క్రమంలోనే నేడు ట్విటర్‌కు చివరిసారి నోటీసులు జారీ చేసింది. నిబంధనలు తక్షణమే పాటించకపోతే.. చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. అయితే, ఈ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్ ఖాతాకు వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్‌ను కాసేపు తొలగించి, మళ్లీ యాడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన చోటుచేసుకున్న తర్వాత ట్విటర్‌కు నోటీసులు జారీ కావడం గమనార్హం.