Encounter: కాల్పులతో దద్దరిల్లిన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం.. 15 మంది మావోయిస్టుల మృతి

Update: 2025-03-29 04:11 GMT
Encounterr

Encounter

  • whatsapp icon

Encounter: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కాల్పులతో మరోసారి దద్దరిల్లింది. సుక్మా జిల్లా గోగుండా కొండపై ఉపంపల్లి ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులకు భద్రతా బలగాలకు కాల్పులు జరుగుతున్నాయి. ఎదురుకాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మరణించారు. మరణించినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్లో డీఆర్జీ,సీఆర్పీఎఫ్ జవానులు పాల్గొన్నారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News