ఈమధ్యనే రచయిత చిన్ని కృష్ణ ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఓయ్ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాపులర్ రచయిత ఆకుల శివ సీరియస్ గా స్పందించారు. ఇన్నేళ్ళ తన కెరీర్ లో ఎప్పుడూ కెమెరా ముందుకు రావాలని అనిపించలేదు కానీ ఇప్పుడు రావాల్సి వచ్చిందని అన్న చిన్ని కృష్ణ, "ఇంద్ర లాంటి పెద్ద హిట్ సినిమా ఇస్తే తనను ఇంటికి పిలిచి విస్తరాకు వేసి కనీసం భోజనం కూడా పెట్టలేదని అన్నావు. 'నాయక్' సినిమాకు మేము చేసిన వర్క్ చిరంజీవి గారికి నచ్చడంతో ఆయన నన్ను, వినాయక్ గారిని ఇంటికి పిలిచి, భోజనం పెట్టడమే కాదు, రూ. 5 లక్షల డబ్బు ఇచ్చి 150 వ సినిమాకు మాటలు రాయమని కోరారు. అది ఆయన సంస్కారం." అని చెప్పుకొచ్చారు.
"అయన భోజనం పెట్టలేదు. బాల పాయింట్ పెన్ ఇవ్వలేదు అంటావే అసలు నీగురించి తెలిసిన వారెవరైనా నిన్ను ఇంటికి పిలుస్తారా? కొన్నేళ్ళ క్రితం నీ సోదరుడు తెనాలిలో ఒక కేసులో ఇరుక్కుంటే అతనిని విడిపించమని నా కాళ్ళు పట్టుకున్నావు అప్పుడు హైదరాబాద్ నుండి అక్కడికి వెళ్లి నాకున్న పరిచయాలతో అతడ్ని విడిపించాను" అని గుర్తుచేశారు శివ. "నీకు పవన్ కళ్యాణ్ గురించి.. చిరంజీవి గారి గురించి వ్యక్తిగతంగా విమర్శించే అర్హత ఉందా? ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ పుస్తకం మొత్తం తెరుస్తాను. పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేయమని వందల సార్లు అడిగావు నువ్వు. కులం చూసి ఎవరూ దగ్గరకు తీసుకోరు. గుణం మాత్రమే చూసి ఇస్తారు." అని అన్నారు.
నీ గతం మొత్తం తెలిసిన వాడిని. నీవల్ల నష్టపోయిన వాడిని. ఈరోజు నేను సమాజానికి చెప్తున్నాను. 'ఇంద్ర' సినిమాలో గవర్నర్ ఇంట్రడక్షన్ నుంచి కామెడి ట్రాక్ నుంచి, లవ్ సీన్స్ నుండి, నీది తెనాలి నాది తెనాలి వరకు రాసింది ఎవరు? చిరంజీవి గారు నన్ను ' శివ, రైటర్ గా నీ పేరు వేసుకో' అంటే ఆరోజు రాత్రి ఎడ్చావు. అందుకే నీ పేరు వేయించుకుంటా అంటే సరే అన్నా. 'ఆనంద పుంగాట్రె' అని తమిళ సినిమాను నువ్వు ఉన్నది ఉన్నట్టు కొట్టేస్తే, సీ. కళ్యాణ్ గారు నిన్ను కొట్టాడానికి వస్తే కాపాడింది ఎవరో గుర్తుందా? ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ మొత్తం పేజీలు ఓపెన్ చేస్తా." అని హెచ్చరించారు ఆకుల శివ.